VMRNews//చర్ల రజక సంఘం నూతన కమిటి ఎన్నిక


చర్ల రజక సంఘం నూతన కమిటి ఎన్నిక





చర్ల మండల కేంద్రంలో గల  స్థానిక రజక ధోబి ఘాట్ నందు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఈ కార్యక్రమంను  నిర్వహించారు.

భద్రాద్రి జిల్లా  అధ్యక్షులు చిటికెన భాస్కరరావు, జిల్లా అధ్యక్షులు కణతాల వసంతరావుల అధ్యక్షతన, స్థానిక రజకులందరి సమక్షంలో చర్ల గ్రామ స్థాయి రజక సంఘం నూతన కమిటీ   అద్యక్షులు  కోటి నరేష్, ఉపాధ్యక్షులు పొనగంటి సడాలు, కార్యదర్శి  ఐతం రాజు,  ఈశ్వరి, ఉప కార్యదర్శి పగిళ్ల రాధ, కోశాధికారి పుప్పాల లక్ష్మీలను ఎన్నుకోవడం జరిగింది.  పై కమిటీని జిల్లా అనుబంధ కమిటీ గానూ,  తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల జెఏసి అనుబంధ సంఘం గానూ గుర్తింపునిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కణతాల వసంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రంజిత్ కుమార్, సరస్వతి, విజయలక్ష్మి, నాగరత్నం, రవికుమార్, శోభారాణి, పొనగంటి సౌజన్య, పగిళ్ల కృష్ణ, రాంబాబు తదితర  వంద మంది సభ్యులు పాల్గొన్నారు...

VMRNews//స్వయంభు సీతారాముల స్థలపురాణానికి విరుద్ధంగా భద్రాచలం రామాలయం క్రతువులు!

 స్వయంభు సీతారాముల స్థలపురాణానికి విరుద్ధంగా భద్రాచలం రామాలయం క్రతువులు!



ఆదివారం, గొటుల్ - గోండ్వాన అధ్యయన కేంద్రం, భద్రాచలంలో ఆదిమ జాతుల సమన్వయ సమావేశం ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక, గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ అధ్యక్షతన జరిగింది.

  ఈ సమావేశంలో దమ్మక్క సేవాయాత్రలో దమ్మక వారసులు ఆదివాసీలు కేవలం ఆటబొమ్మలు కావడం విడ్డూరమని, ఇది ఆదివాసీలతో గడపాలని  స్వయంబు వెలసిన సీతారాముల కోరికకి విరుద్దమని, ఇది ఆ సీతారామచంద్రులను అవమానించడమేనని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రూ ఆక్షేపించారు.




    భద్రాచలం చారిత్రక నేపథ్యనికి ఎటువంటి సంబంధం లేని కొందరి వలస వాదుల ఆధిపత్యంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దేవస్థానం బానిసయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడి కోరిక తీరకుండా ప్రాకారాలు కట్టిమరీ బందించారు. లాభాపేక్షతో  క్రతువుల పేరిట వ్యాపారం చేస్తున్నారు. సీతారామచంద్రులను క్షోభకు గురించేస్తున్నారని,పాపం మూటకట్టుకుంటున్నారని. ఇప్పటికైనా కళ్లుతెరిచి ప్రభుతం తక్షణం స్వయంబు సీతారాముల కోరికకనుగుణంగా దమ్మక్క వారసులతో ఆదివాసీ సంప్రదాయ పద్దతులకనుగుణంగా నిత్య క్రతువులు సాగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా నాయకులు జగ్గా పుల్లయ్య, మహిళా నాయకులు జగ్గా కుమారి, ఆదివాసీ కొండరెడ్ల సంఘం జిల్లా నాయకులు ఉమ్మల దుర్గా రెడ్డి,గొటల్ అధ్యక్షులు వీసాల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

VMRNews//పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలు పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలు పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు. 

 టి మీడియా భద్రాచలం.
వరద ముంపునకు గురైన అశోక్ నగర్ కొత్త కాలనీ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రం నన్నపనేని స్కూల్ కి తరలించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే పొందెను వీరయ్య ఆదేశానుసారం భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సరళ నరేష్ వెళ్లి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలిగిన మా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బలుసు సతీష్ దొడ్డిపట్ల సత్యలింగం పాల్గొన్నారు.

VMRNews// LRS కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు.

 

LRS కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు



ర్టీ రాష్ట్ర  పార్టీ మేరకు కొణిజర్ల మండలం  అధ్యక్షుడు మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం తీసుకొస్తున్న ఎల్.ఆర్.ఎస్ విధానం  పేద, మధ్య తరగతి ప్రజలకు నడ్డి విరిచే లా ఉంది. ఈ ఎల్.ఆర్.ఎస్  విధానాన్ని టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం రద్దు చేయాలని కొణిజర్ల మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ మాట్లాడుతూ  ఎల్. ఆర్. ఎస్ విధానం వలన పేద్ ప్రజలకి ఇబ్బందికరంగా మారుతుంది అని,ప్రజలకు తెలియకుండానే రక్తం పీల్చేలా ఉంటుందని. టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం మాట్లు చెప్పటమే గాని చేసేది ఏమీ లేదు అని, సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైరా నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేష్, తుప్పతి రామారావు, కవిడ రాము, మరిదు వేణు, ఉపుతాల రామారావు, గంజి రాజేష్, బండి శైదులు, జగపతిబాబును, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

VMRNews// లోకసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు కి నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పంజాబ్ కి చెందిన అకాలీదళ్ లోక్ సభ సభ్యురాలు శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు -

 




ఓపిక తో  ఒకసారి చదవండి /---లోకసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు కి నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పంజాబ్ కి చెందిన అకాలీదళ్  లోక్ సభ సభ్యురాలు శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు - 


భయంతో దేశం వదలి దుబాయి వెళ్లిపోతున్న బాలీ వుడ్ నటీ నటులు....


 *రెండూ వేరేవేరు ఘటనలు కానీ ఉమ్మడిగా ఒకే అంశం ఉంది పై రెండు విషయాలలో....*


 *కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ బిల్లు,*

 క్లుప్తంగా బిల్లు యొక్క లాభాలు ఏమిటో చూద్దాం.

 *ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం మధ్య దళారీల నుండి రైతులని రక్షించడం కోసం ఉద్దేస్యించినది.*

 దీనివల్ల దేశం లో ఉన్న 80%  చిన్న,సన్నకారు రైతులకి మేలు కలుగుతుంది. 

 *మధ్య దళారీలు , కమిషన్ ఏజెంట్ల ని రైతులకి దూరంగా ఉంచుతుంది ఈ బిల్లు.*

 తను పండించిన పంటకి తానే ధర నిర్ణయించుకునే వెసులుబాటు ఇస్తుంది ఈ బిల్లు. అలాగే దేశంలో ఎక్కడయినా తమ పంటని అమ్ముకునే స్వేచ్చని ఇస్తున్నది ఈ బిల్లు. ఈ బిల్లు వల్ల నష్టపోయేది కమిషన్ ఏజెంట్లు, పెద్ద ఎత్తున కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమే . అయితే ప్రధానంగా పంజాబ్ & హర్యానాలలో వసూలు చేసే *'మండి టాక్స్ ' [మండి అంటే మార్కెట్టు ] ని కోల్పోతాయి అందుకే వీళ్ళు గొడవ చేస్తున్నారు* 

కానీ రైతులమీద వీళ్ళకి ప్రేమ ఉంది కాదు. రైతులని దోచుకోవడానికి ఉన్న రాజ మార్గం మూసుకుపోతున్నది ఈ బిల్లు వల్ల. ముఖ్యంగా పంజాబ్,హర్యానా రాష్ట్రాలకి మండీ టాక్స్ వల్ల గణనీయమయిన పన్ను రెవెన్యూ రూపంలో వస్తున్నది ఇప్పటివరకు కానీ ఈ బిల్లు వల్ల ఆ ఆదాయం రాదు ఇకమీదట. 

ఇప్పటివరకు దళారీలు,మార్కెట్ కమిటీలు నిర్ణయించిన ధర కె అమ్ముకోవాల్సి వస్తున్నది ఒక్కో సారి పంటకి అయ్యిన ఖర్చు,రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు అవట్లేదు. దళారీలు అందరూ సిండికేట్ అయి రైతులని ముంచుతున్నారు. ఈ అగ్రి బిల్ ప్రకారం రైతు తన పంటని ఎవరికయినా అమ్ముకోవచ్చు. తన పొలం దగ్గరే తనకి నచ్చిన ధరకి అమ్ముకోవచ్చు ఎవరికయినా. ముదస్తుగా ఒప్పందం చేసుకొని ఎవరికి ఏ పంట ఎంత కావాలో ఆ పంట వేసి వాళ్ళకి నేరుగా అమ్ముకోవచ్చు . దీనివలన తన పంటని తన పొలం దగ్గరే అమ్ముకోవడం వల్ల రవాణా ఖర్చు ఉండదు , రోజుల తరబడి మార్కెట్ యార్ద్లలో కొనేవాడి కోసం ఎదురుచూడడం అనేది ఇక ఉండబోదు. పైగా మార్కెట్ పన్నులు ఉండవు. 

 *అత్యవసర వస్తువుల చట్టం*

 *The essential commodities (Amendment) Bill, 2020* వల్ల తృణ ధాన్యాలు,పప్పులు. ఆయిల్ సీడ్స్ , వంట నూనెలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు లాంటి వాటిని తీసేస్తున్నారు,

 *ఇప్పటివరకు ఎస్సెన్షియల్ కొమొడిటీస్ యాక్ట్ కింద ఉన్నాయి అంటే వీటి అమ్మకాలమీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉండేది అది ఇప్పుడు ఉండదు.* అలాగే రైతులు పండించిన తమ పంటని తనకి నచ్చిన ధర వచ్చేవరకు నిల్వ చేసుకోవచ్చు వీటి మీద ఎలాంటి ఆంక్షలు ఇక ముందు ఉండబోవు. అంటే ఎంత స్టాక్ చేసుకోవాలో లిమిట్ అనేది ఉండబోదు. దీనివల్ల విదేశాలనుండి పెట్టుబడులు వస్తాయి వ్యవసాయ రంగానికి అలాగే ప్రైవేట్ సెక్టార్ నుండి నిధులు రైతులకి లభిస్తాయి. పెద్ద పెద్ద సంస్థలు తమకి కావాల్సిన పంట కోసం రైతులతో ఒక ధర నిర్ణయం చేసుకొని ముందుగా అడ్వాన్స్ చెల్లిస్తారు పంట చేతికి రాగానే వాళ్ళే తీసుకెళ్తారు. రైతుకీ డబ్బు,రవాణా , మార్కెట్ పన్ను లాంటివి ఉండవు. 

 *FDI [Foriegn Direct Investments ] లు మన రైతులమీద పెట్టుబడులు పెడతారు ఇది చాలా ముఖ్యమయిన అంశం.*

 

 *ఎవరు వ్యతిరేకిస్తున్నారు ? మధ్య దళారీలు, కమిషన్ ఏజెంట్లు, రైతులకి అధిక వడ్డీలకి అప్పులు ఇచ్చే వాళ్ళు.* వీళ్ళందరికీ ఆయా రాష్ట్రాలలో ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉంటున్నది అలాగే వీళ్ళు రాజకీయ పార్టీలకి విరాళాల రూపంలో డబ్బు ఇచ్చి ప్రభుత్వ అండ తీసుకుంటున్నారు. 

 *BKU [ భారతీయ కిసాన్ యూనియన్ ],* 

 *All India Kisan Sangarsh Co ordination Committee (AIKSCC),* 

 వీళ్ళు ఆందోళన బాట పట్టడానికి కారణం రైతుల మీద ప్రేమ కాదు ఇప్పటికే పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉన్న బడా బాబులకి సహాయం చేయడానికి ఎందుకంటే చిన్న రైతుల చేతుల్లోకి డబ్బు వస్తే వీళ్ళ మాట వినరు కనుక. ఇక *మహారాష్ట్ర కి చెందిన 'శేత్కారీ సంఘటన' ఈ బిల్లుని సమర్ధిస్తున్నది.*

 పంజాబ్ హర్యానాలలో అకాలీదళ్ కి చెందిన వాళ్లే ఎక్కువగా కమీషన్ ఏజంట్లు లేదా మధ్య దళారీలుగా ఉన్నారు వీళ్ళ ఆదాయం వందల కోట్లలో ఉంటుంది ప్రతీ సంవత్సరం. అలాగే మార్కెట్ లేదా మండీ టాక్స్ ఎక్కువగా వసూలు అయ్యేది పై రెండు రాష్టాలలో అదీ హరి సిమ్రత్ కౌర్ గారి రాజీనామాకి రెండవ కారణం. మొదటి కారణం డ్రగ్స్ . 

పాకిస్తాన్ నుండి పంజాబ్ ద్వారా ఎక్కువగా డ్రగ్స్ స్మగుల్ అవుతున్నాయన్నది గత 20 ఏళ్లుగా అందరికీ తెలిసిన నిజం. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఎక్కువభాగం అకాలీదళ్ కి చెందివ వారే ఎక్కువగా ఉన్నారు. SSR హత్య కేసు లో డ్రగ్స్ పాత్ర బయటపడి వాటి సూత్రధారుల పేర్లు ఇప్పటికీ బయటికి రాకపోయినా ముందు ముందు పంజాబ్ కి చెందిన అకాలీ దళ్ నేతల మెడకి చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి అందుకే అప్పుడు బయటపడ్డాక వెళ్ళే కంటే ముందే వ్యవసాయ బిల్లు మీద నిరసనగా వెళ్తే మంచిదని అకాలీ దళ్ ముందస్తు ఆలోచన.

 *పది రోజుల క్రితం మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని స్వయంగా హోం మంత్రే ప్రకటించాడు* కానీ ఆ ఫోన్ కాల్ ని RAW విన్నదని తెలియగానే ప్రకటన చేశారు కానీ లేకపోతే ఆ విషయం రహస్యంగానే ఉండిపోయేది. బాలీవుడ్ డ్ర గ్గిస్టులని కాపాడాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ ఫోన్ కాల్ బెదిరింపు. NCB రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందనీ వేడుకోలు. సొ ! రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు కాబట్టి స్వయంగా D గాంగ్ అనుచరులు బాలీవుడ్ డ్రగ్గిస్టుల రక్షన బాధ్యత తీసుకున్నారు. దుబాయ్ లో IPL మాచులు చూడడానికి అని చెప్పి ఒక్కొరూ జారుకున్నారు. డ్రగ్స్ వ్యవహారం కొంచెం చల్లబడ్డాక తిరిగి రావాలని ప్లాన్. అప్పటివరకూ దుబాయ్ లో D గాంగ్ అనుచరుల నీడలో సేదతీర్చుకోవచ్చు. దావూద్ కి బాలీవుడ్ లో చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఉంది. దానితో పాటు డ్రగ్స్ వ్యాపారం కూడా వీళ్ళవల్లనే సజావుగా సాగిపోతున్నది కాబట్టి వీళ్ళని తాత్కాలికంగా అయినా కాపాడుకోవాల్సిన బాధ్యత దావూద్ కి ఉంది. అలాగే పంజాబ్ లో ఉన్న డ్రగ్స్ పేడలర్స్ ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇదో పెద్ద వలయం ఒకదానితో ఇంకోటి లింక్ ఉన్నాయి. 

కరణ్ జోహార్ గోవా వెళ్లిపోయాడు. సంజయ్ దత్ అతని ఫామిలీ, సల్మాన్ ఖాన్ ఫామిలీ అతని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు , ఇంకా చాలమందే లిస్ట్ లో ఉన్నారు. నిజానికి రేపో మాపో కరణ్ జోహార్ ని ప్రశించడానికి సిద్ధంగా ఉంది NCB. కరణ్ ఇంట్లో తరుచూ జరిగే పార్టీలలో ఖరీదయిన మద్యం తో పాటు డ్రగ్స్ కూడా ఇస్తాడు. ఇటీవలే ఒక వీడియో వైరల్ అయ్యింది కరణ్ ఇంట్లో జరిగినట్లుగా అందులో ప్రముఖ నటీ నటులు డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు స్పష్టంగా. నిజానికి ఒక చిన్న క్లిప్ మాత్రమే బయటికి వచ్చింది కానీ మొత్తం వీడియో ఇప్పుడు CBI,NCB ల చేతిలో ఉంది. ముంబై లో ipl జరిగితే ఎవరూ రారు కానీ దుబాయ్ లో IPL కి వీళ్ళు వెళ్ళడం అంటేనే అర్ధమవుతున్నది. కనీసం ఓ రెండు నెలలు ఆదాయం లేకపోయినా సరే దుబాయ్ లో ఉండి తాత్కాలికంగా CBI,NCB ల నుండి దూరంగా ఉండొచ్చు అని వీళ్ళ ఆశ. 

గత అయిదు నెలలుగా ఆదాయం లేకపోయినా నెల లేదా రెండు నెలలు దుబాయ్ లో విలాసవంతంగా గడిపెంత డబ్బు వీళ్ళ దగ్గర ఉందా అన్నదే ప్రశ్న. 

పనిలో పనిగా వాణిజ్య ప్రకటనల కోసం ప్రస్తుతం వీళ్ళని ఎవరూ అడగట్లేదని వార్త. 

ఇప్పుడు యాడ్ ఏజెన్సీలు అన్నీ కూడా క్రికెటర్ల వెంట పరిగెడుతున్నాయి. 

ఇదో మంచి వార్త . 

డ్రగ్స్ వ్యవహారం అటు రాజకీయ,సినీ రంగాలకి బాగానే సెగ చూపిస్తున్నది...


 *జై హింద్ !*🇮🇳💐💐💐

VMRNews// ఖమ్మం ట్రాఫిక్ పోలీసు రిసెప్షన్ సెంటర్ ను ప్రారంభించిన పోలీసు కమిషనర్

 ఖమ్మం ట్రాఫిక్ పోలీసు రిసెప్షన్ సెంటర్ ను ప్రారంభించిన పోలీసు కమిషనర్.



ఖమ్మం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో నూతనంగా నిర్మించిన పోలీసు రిసెప్షన్ సెంటర్ ను పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ ….రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, రిసెప్షనిస్టులుగా మహిళ సిబ్బంది నియమించి వారికి అనునిత్యం నూతన తరహాలో రిసిప్షన్‌ సెంటర్‌ కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా పోలీసు స్టేషన్‌కి వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతీ ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడం జరుగుతుందన్నారు. అందులో రిసెప్షనిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. పోలీసు స్టేషన్‌ను సందర్శించే ప్రతి పౌరుని సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారి మనసులో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తూ పోలీసు స్టేషన్‌ అనేది ఒక సేవాకేంద్రంలాంటిదనే భావన వారికి కలిగించేలా ప్రవర్తించాలన్నారు. స్టేషన్‌లోని వివిధ అధికారులను, సమన్వయం చేసుకొని తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలందరికి పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం కల్పించడంలో రిసెప్షన్‌ ఆఫీ సర్‌ ముఖ్య భూమిక పోషిస్తారని తెలిపారు.

కార్యక్రమంలో అడీషనల్ డీసీపీ ఆడ్మీన్ ఇంజరాపు పూజ, అడీషనల్ డీసీపీ లా&ఆర్డర్ మురళీధర్, ట్రైనీ ఐపిఎస్ అధికారిణి ధాత్రీరెడ్డి, ఏసీపీలు రామోజీ రమేష్ , వెంకటరెడ్డి , ప్రసన్న కుమార్ , సిఐలు కరుణకర్, చిట్టిబాబు, తుమ్మ గోపి, శ్రీధర్, ట్రాఫిక్ ఎస్సైలు మాదార్, వెంకటచారి, యాకుబ్, ASI సౌకత్ ఆలీ, నాగేశ్వరరావు ,
రామారావు పాల్గొన్నారు.

VMRNews// అమీర్ ఖాన్ టర్కీ పర్యటన - విశ్లేషణ - కొన్ని వాస్తవాలు

 అమీర్ ఖాన్ టర్కీ పర్యటన - విశ్లేషణ - కొన్ని వాస్తవాలు :

సినిమా నటులని.. వాళ్ళ నటనని అభిమానించడం వరకు ఫరవాలేదు కానీ వాళ్ళ నటననే వాళ్ళ అసలు జీవితం అని అనుకుంటేనే ప్రమాదం. నటన వేరు వాళ్ళ వ్యక్తిగత జీవితం వేరు. సినిమాలలో దాన కర్ణుడి వేషం వేసి మొత్తం దానం చేయడం చూసి వీళ్ళు నిజ జీవితంలో కూడా అలానే ఉంటారు అనుకునే వాళ్ళకి కోదువ లేదు మన దేశంలో. సినిమా కర్ణుడు వేరు నిజ జీవితం లో వాళ్ళ దాతృత్వం వేరు. మా దగ్గర ఏముందీ బూడిద తప్ప అనేస్తారు ఎవరన్నా సహాయం కోసం వెళితే. సినిమాలలో సత్యం,ధర్మం కోసం పోరాడే నాయకుడి పాత్రని చూసి అబ్బో అనేసుకొని అదే వాళ్ళ నిజ జీవితంలో కూడా అలానే ఉంటారు అనుకోవద్దు. నిజ జీవితంలో దేశ ద్రోహం చేయడానికి ఎంతకయినా తెగించే సినీ నటులకి కొదవులేదు. దొరికిన వాడు దొంగ దొరకని వాడు దొర అంతే. 

అమీర్ ఖాన్ విషయానికి వస్తే చాలా తెలివిగా ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తాడు. Mr.పెర్ఫెక్షనిస్ట్ అంటే నిజ జీవితంలో ఎలా ఉంటాడో యాదృచ్చికంగా సుకుమార్ ఆర్యాలో కుండ బద్ధలు కొట్టినట్లు చూపించేశాడు. అందులో అతిశయోక్తి లేదు. మెట్లాక్కాలంటే అదే మెట్లని తొక్కాలి లేకపోతే పైకి వెళ్లలేరు..ఇది విజయానికి తొలిమెట్టు అంటూ జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో మనం చాలా పుస్తకాల్లో చదేవే ఉంటాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి కొందరే వీటిని తూ.ఛ . తప్పకుండా పాటిస్తారు. సినిమా రాజకీయాలు ఎలా ఉంటాయంటే రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ సినీ రాజకీయాల ముందు బలాదూర్. తను పిక్చర్ లోకి రాకుండా తెలివిగా వెనుకనుండి నరుక్కొచ్చే కళ అమీర్ కి ముందునుండే ఉంది సహజంగా. 




1. 2012 'సత్యమేవ జయతే' అనే 'టాక్ షో ' స్టార్ టి‌వి తో పాటు DD నేషనల్ లో టేలీకాస్ట్ అయ్యింది. మొదట్లో స్టార్ టీవి యాజమాన్యం అమీర్ ని సంప్రదించగా నేను చేయలేను అన్నాడు కానీ తరువాత కమ్మీ రచయితలు స్క్రిప్ట్ ఇస్తామనే సరికి ఒప్పుకున్నాడు. అమీర్ తో పాటు  భార్య కిరణ్ రావ్ కూడా  నిర్మాత మొత్తం ఎపిసోడ్స్ కి . మొత్తం మూడు సీజన్లు గా టెలీకాస్ట్ అయ్యింది సత్యమేవ జయతే. భారత దేశం ఎదుర్కుంటున్న సమస్యలమీద విశ్లేషణ చేస్తూ టాక్ షో అది. బాల కార్మికులు, ఆడపిల్ల అయితే అబార్షన్ చేయడం, నీటి సమస్యలు, గృహ హింస ఇలా మొత్తం 30 భాగాలుగా వివిధ సమస్యల మీద ఆవేదన వ్యక్తం చేస్తూ తనదయిన స్టైల్ లో తెగ బాధపడ్డాడు. షరా మామూలుగా పుర్ర చేయి మీడియా,కాంగీ మీడియా ఆకాశానికి ఎత్తేసాయి. మొత్తం 100 దేశాల్లో ఇంగ్లీష్ సబ్ టైటల్స్ తో ప్రసారం అయింది. మన ప్రాంతీయభాషల్లో కూడా డబ్బింగ్ తో ప్రసారం అయ్యాయి అన్నీ ఎపిసోడ్స్. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు అమీర్ ... గృహ హింస సమస్య మీద చాలా బాగా నటిస్తూ కన్నీళ్లు తెప్పించేవిధంగా ప్లాన్ చేశాడు బాగుంది మరి గృహ హింస అంటే  హిందువుల భార్య భర్తల దేనా ? ట్రిపుల్ తలాక్ అనేది గృహ హింస కాదా ? కానీ ట్రిపుల్ తలాక్ ఊసే ఎత్తకుండా జాగ్రత్తపడ్డాడు. బహు బార్యలు ఉండడం, అధిక సంతానం మీద మాత్రం మాట్లాడలేదు. దేశ జనాభా కారణం గా కొన్ని విషయాలు ప్రస్తావించాడు కానీ అధిక సంతానం మీద మాత్రం నోరు పెగలలేదు. నీటి సమస్య మీద మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం ని నిలదీశాడు కానీ రాజకీయ,సినీ ప్రముఖుల స్నానాల కోసం మీనరల్ వాటర్ పెద్ద మొత్తంలో వాడకాన్ని ప్రశించలేకపోయాడు పాపం. అసలు సత్యమేవ జయతే చూసిన ప్రేక్షకులు పాపం అమీర్ దేశం కోసం బాధపడుతున్నాడు ఉచితంగా అనుకున్నారు కానీ .......ఒక్కో ఎపిసోడ్ కి 3 కోట్లు తీసుకున్నాడు అలాగే ప్రతీ ఎపిసోడ్ ప్రోమోషన్ ఆడ్ కి 10 సెకన్ల కి 30 లక్షలు తీసుకున్నాడు. కానీ ఈ విషయం ఎక్కడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. 100 దేశాల్లో టే లీకాస్ట్ అయ్యింది తద్వారా ప్రకటనల రూపంలో వచ్చిన ఆదాయం లో తన వాటా ఎంతో చెప్పడు. దేశం కోసం కన్నీరు కార్చే నటులని నమ్మకండి. ఈ విషయం లో అమీర్ Mr.పెర్ఫెక్షనిస్ట్ . 

2. 2018 లో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు భారత పర్యటనకి వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రధాని గౌరవార్ధం ముంబై లో షలోమ్ ఇండియా ఫెస్ట్ [Shalom India Fest ] జరిగింది. ఈ ఫెస్ట్ లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో పాటు ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజిమిన్ నేతన్యాహు పాల్గొన్నారు. బాలీ వుడ్ ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. అమితాబ్ బచ్చన్ తో సహా మిగతావాళ్లు ఆ ఫెస్ట్ కి హాజరయ్యారు. నేతన్యాహూ తో సెల్ఫీలు దిగారు కానీ అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లు మాత్రం హాజరవ్వలేదు ఎందుకంటే అరబ్ దేశాలకి కోపం వస్తుంది. ఇక్కడ భారత ప్రధాని ఆహ్వానం ని తిరస్కరించారు అరబ్ దేశాలతో పాటు పాకిస్తాన్ ని సంతృప్తి పరచడం కోసం. వీళ్ళు భారతీయులా ? ఇప్పుడు అదే ఇజ్రాయెల్ తో UAE కలిసిపోయి రక్షణ,వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నది మరి తల ఎక్కడ పెట్టుకుంటారు ఈ ఖాన్లు ? ఇక నుండి దుబాయి కేంద్రంగా నల్ల డబ్బు బాలివుడ్ లోకి రాదేమో ? అందుకే తమ కేంద్రాన్ని టర్కీ కి మార్చాలనుకుంటున్నారా ? 

3.లాల్ చంద్ ఛడ్డా [ఫారెస్ట్ గంప్ - Forrest Gump ఇన్స్పిరేషన్ ]సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్ళాడు అమీర్ ఖాన్ సరే వెళ్లొచ్చు కానీ ప్రోటోకాల్ పాటించకుండా నేరుగా టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ ని ఎందుకు కలిసినట్లు ? టర్కీ లోని భారత రాయబార కార్యాలనికి వెళ్ళి తను టర్కీ అధ్యక్షుడు అతని భార్యని కలుస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వాలి , ఇది ప్రోటోకాల్ ఎందుకంటే అమీర్ ఖాన్ భారతీయుడు కనుక కానీ అసలు భారత రాయబార కార్యాలయానికి ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. పైగా టర్కీ వెళ్ళి అక్కడ నా భార్యకి ఈ దేశం చాలా బాగా నచ్చింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతం ? 2015 లో నా భార్య భారతదేశంలో ఉండడానికి భయపడుతున్నది అంటూ బహిరంగంగా వాగాడు దాంతో ప్రజలు తిరగబడం తెలిసిందే. అమీర్ బ్రాండ్ అంబాసడ  ర్  ఉన్న ప్రముఖ కమపనీలకి ఆ సెగ బాగానే తగిలింది ముఖ్యంగా అప్పట్లో మాంచి ఊపు మీద ఉన్న ఆలైన్ పోర్టల్ స్నాప్ డీల్[Snap Deal ] కి ఆ సెగ బాగా తగిలి ఇప్పుడు సోదిలోకి లేకుండా పోయింది. అప్పటినుండి ప్రముఖ కంపనీలు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఖాంలని పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. 

5. ఈ ఖాన్ త్రయానికి బయటి దేశాలనుండి డబ్బు వచ్చే మార్గాలు ఇటీవలే బయటపడ్డాయి. విదేశాల్లో ఉండే ధియేటర్ యాజమాన్యాలతో ముంబై పొడక్షన్ హౌస్లు చాలా దగ్గర కనెక్షన్స్ ని కలిగి ఉన్నాయి. అక్కడ ధియేటర్ యాజమాన్యాలతో ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఖాన్ల సినిమాలు ఆడే ధియేటర్ లలో టిక్కెట్స్ పూర్తిగా అమ్ముడుపోకపోతే ఎన్ని సీట్లు మిగిలితే అన్నీ సీట్లకి టికెట్స్ చించేస్తారు వాటికి అయ్యే టాక్స్ కూడా కట్టేస్తారు. ఉదా : ఒక ధియేటర్ లో 500 సీట్లు ఉంటే 150 మంది ప్రేక్షకులు టికెట్స్ కొంటె మిగిలిన 350 ఫెక్ టికెట్స్ ని చిన్చేస్తారు. ఆ డబ్బుని రాజ మార్గంలో ఇండియా కి పంపిస్తారు అంటే హవాలా అని చెప్పలేరు ఎవరూ. దంగల్ విషయంలో చైనా లో ఇలానే చేశాడు అమీర్ . అక్కడ 5000 ధియేటర్ లు ఉంటే అన్నీ చోట్లా ప్రతి రోజూ హౌస్ ఫుల్ అనిపించారు. మొత్తంగా 380 కోట్లు కలెక్షన్స్ అనిపించారు. కాంగ్రెస్ కి చైనా తో ఉన్న బంధం ద్వారా ఈ అక్రమానికి తెర లేపారు. ఇప్పుడు చైనాతో మనకి బాగాలేదు కాబట్టి అక్కడ లాల్ చంద్ చద్దా రిలీజ్ చేయలేడు అలాగే పాకిస్తాన్ లో కూడా రిలీజ్ చేయలేడు. మిగిలింది అరబ్ దేశాలు కానీ ఇప్పుడు అవి సహకరించే స్థితిలో లేవు కాబట్టి టర్కీ వెళ్ళి అక్కడి దేశాధినేతతో మాట్లాడుకుంటే మొత్తం కాకపోయినా సగం పని అయినా జరిగిపోతుంది దొంగ టిక్కెట్ల ద్వారా. లేకపోతే అమీర్ ఏమన్నా హాలీవుడ్ నటుడా ? నేరుగా దేశాధినేతలని కలవడానికి ? పాకిస్తాన్ నుండి ఆదేశాలు,సూచనలు వస్తాయి అంతే !

6. మారిన పరిస్థితుల్లో దుబాయి నుండి వ్యవహారాలు నడిపే పరిస్తితి లేదు ఎందుకంటే అక్కడ ఇప్పుడు మొస్సాడ్ కి ఇంతకుముందుకంటే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇది పాకిస్తాన్ ISI కి తెలుసు కాబట్టే మకాం టర్కీ కి మార్చాడు దావూద్ ఇబ్రాహిం. కరణ్ జోహార్ , మహేశ్ భట్, ఖాన్ త్రయానికి దావూద్ గాంగ్ ద్వారా వచ్చే నల్ల డబ్బే పెట్టుబడి. ఏమాత్రం ఆధారం దొరికినా భారత్ అడగడమే ఆలస్యం దుబాయ్ ప్రభుత్వం వీళ్ళ ఆస్తులని అప్పచెప్పేస్తుంది. అమీర్ లాల్ చంద్ ఛాడ్డా టర్కీకి సంబంధం ఇదే. వీళ్ళ సినిమాలని చూడకుండా ఉంటే అదే వీళ్ళకి తగిన శిక్ష. 

జైహింద్ !

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...