చర్ల రజక సంఘం నూతన కమిటి ఎన్నిక
చర్ల మండల కేంద్రంలో గల స్థానిక రజక ధోబి ఘాట్ నందు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఈ కార్యక్రమంను నిర్వహించారు.
భద్రాద్రి జిల్లా అధ్యక్షులు చిటికెన భాస్కరరావు, జిల్లా అధ్యక్షులు కణతాల వసంతరావుల అధ్యక్షతన, స్థానిక రజకులందరి సమక్షంలో చర్ల గ్రామ స్థాయి రజక సంఘం నూతన కమిటీ అద్యక్షులు కోటి నరేష్, ఉపాధ్యక్షులు పొనగంటి సడాలు, కార్యదర్శి ఐతం రాజు, ఈశ్వరి, ఉప కార్యదర్శి పగిళ్ల రాధ, కోశాధికారి పుప్పాల లక్ష్మీలను ఎన్నుకోవడం జరిగింది. పై కమిటీని జిల్లా అనుబంధ కమిటీ గానూ, తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల జెఏసి అనుబంధ సంఘం గానూ గుర్తింపునిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కణతాల వసంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రంజిత్ కుమార్, సరస్వతి, విజయలక్ష్మి, నాగరత్నం, రవికుమార్, శోభారాణి, పొనగంటి సౌజన్య, పగిళ్ల కృష్ణ, రాంబాబు తదితర వంద మంది సభ్యులు పాల్గొన్నారు...
No comments:
Post a Comment