ఖమ్మం ట్రాఫిక్ పోలీసు రిసెప్షన్ సెంటర్ ను ప్రారంభించిన పోలీసు కమిషనర్.
ఖమ్మం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో నూతనంగా నిర్మించిన పోలీసు రిసెప్షన్ సెంటర్ ను పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ ….రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, రిసెప్షనిస్టులుగా మహిళ సిబ్బంది నియమించి వారికి అనునిత్యం నూతన తరహాలో రిసిప్షన్ సెంటర్ కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా పోలీసు స్టేషన్‌కి వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతీ ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడం జరుగుతుందన్నారు. అందులో రిసెప్షనిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. పోలీసు స్టేషన్‌ను సందర్శించే ప్రతి పౌరుని సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారి మనసులో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తూ పోలీసు స్టేషన్ అనేది ఒక సేవాకేంద్రంలాంటిదనే భావన వారికి కలిగించేలా ప్రవర్తించాలన్నారు. స్టేషన్‌లోని వివిధ అధికారులను, సమన్వయం చేసుకొని తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలందరికి పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం కల్పించడంలో రిసెప్షన్ ఆఫీ సర్ ముఖ్య భూమిక పోషిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అడీషనల్ డీసీపీ ఆడ్మీన్ ఇంజరాపు పూజ, అడీషనల్ డీసీపీ లా&ఆర్డర్ మురళీధర్, ట్రైనీ ఐపిఎస్ అధికారిణి ధాత్రీరెడ్డి, ఏసీపీలు రామోజీ రమేష్ , వెంకటరెడ్డి , ప్రసన్న కుమార్ , సిఐలు కరుణకర్, చిట్టిబాబు, తుమ్మ గోపి, శ్రీధర్, ట్రాఫిక్ ఎస్సైలు మాదార్, వెంకటచారి, యాకుబ్, ASI సౌకత్ ఆలీ, నాగేశ్వరరావు ,
రామారావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment