అమీర్ ఖాన్ టర్కీ పర్యటన - విశ్లేషణ - కొన్ని వాస్తవాలు :
సినిమా నటులని.. వాళ్ళ నటనని అభిమానించడం వరకు ఫరవాలేదు కానీ వాళ్ళ నటననే వాళ్ళ అసలు జీవితం అని అనుకుంటేనే ప్రమాదం. నటన వేరు వాళ్ళ వ్యక్తిగత జీవితం వేరు. సినిమాలలో దాన కర్ణుడి వేషం వేసి మొత్తం దానం చేయడం చూసి వీళ్ళు నిజ జీవితంలో కూడా అలానే ఉంటారు అనుకునే వాళ్ళకి కోదువ లేదు మన దేశంలో. సినిమా కర్ణుడు వేరు నిజ జీవితం లో వాళ్ళ దాతృత్వం వేరు. మా దగ్గర ఏముందీ బూడిద తప్ప అనేస్తారు ఎవరన్నా సహాయం కోసం వెళితే. సినిమాలలో సత్యం,ధర్మం కోసం పోరాడే నాయకుడి పాత్రని చూసి అబ్బో అనేసుకొని అదే వాళ్ళ నిజ జీవితంలో కూడా అలానే ఉంటారు అనుకోవద్దు. నిజ జీవితంలో దేశ ద్రోహం చేయడానికి ఎంతకయినా తెగించే సినీ నటులకి కొదవులేదు. దొరికిన వాడు దొంగ దొరకని వాడు దొర అంతే.
అమీర్ ఖాన్ విషయానికి వస్తే చాలా తెలివిగా ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తాడు. Mr.పెర్ఫెక్షనిస్ట్ అంటే నిజ జీవితంలో ఎలా ఉంటాడో యాదృచ్చికంగా సుకుమార్ ఆర్యాలో కుండ బద్ధలు కొట్టినట్లు చూపించేశాడు. అందులో అతిశయోక్తి లేదు. మెట్లాక్కాలంటే అదే మెట్లని తొక్కాలి లేకపోతే పైకి వెళ్లలేరు..ఇది విజయానికి తొలిమెట్టు అంటూ జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో మనం చాలా పుస్తకాల్లో చదేవే ఉంటాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి కొందరే వీటిని తూ.ఛ . తప్పకుండా పాటిస్తారు. సినిమా రాజకీయాలు ఎలా ఉంటాయంటే రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ సినీ రాజకీయాల ముందు బలాదూర్. తను పిక్చర్ లోకి రాకుండా తెలివిగా వెనుకనుండి నరుక్కొచ్చే కళ అమీర్ కి ముందునుండే ఉంది సహజంగా.
1. 2012 'సత్యమేవ జయతే' అనే 'టాక్ షో ' స్టార్ టివి తో పాటు DD నేషనల్ లో టేలీకాస్ట్ అయ్యింది. మొదట్లో స్టార్ టీవి యాజమాన్యం అమీర్ ని సంప్రదించగా నేను చేయలేను అన్నాడు కానీ తరువాత కమ్మీ రచయితలు స్క్రిప్ట్ ఇస్తామనే సరికి ఒప్పుకున్నాడు. అమీర్ తో పాటు భార్య కిరణ్ రావ్ కూడా నిర్మాత మొత్తం ఎపిసోడ్స్ కి . మొత్తం మూడు సీజన్లు గా టెలీకాస్ట్ అయ్యింది సత్యమేవ జయతే. భారత దేశం ఎదుర్కుంటున్న సమస్యలమీద విశ్లేషణ చేస్తూ టాక్ షో అది. బాల కార్మికులు, ఆడపిల్ల అయితే అబార్షన్ చేయడం, నీటి సమస్యలు, గృహ హింస ఇలా మొత్తం 30 భాగాలుగా వివిధ సమస్యల మీద ఆవేదన వ్యక్తం చేస్తూ తనదయిన స్టైల్ లో తెగ బాధపడ్డాడు. షరా మామూలుగా పుర్ర చేయి మీడియా,కాంగీ మీడియా ఆకాశానికి ఎత్తేసాయి. మొత్తం 100 దేశాల్లో ఇంగ్లీష్ సబ్ టైటల్స్ తో ప్రసారం అయింది. మన ప్రాంతీయభాషల్లో కూడా డబ్బింగ్ తో ప్రసారం అయ్యాయి అన్నీ ఎపిసోడ్స్. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు అమీర్ ... గృహ హింస సమస్య మీద చాలా బాగా నటిస్తూ కన్నీళ్లు తెప్పించేవిధంగా ప్లాన్ చేశాడు బాగుంది మరి గృహ హింస అంటే హిందువుల భార్య భర్తల దేనా ? ట్రిపుల్ తలాక్ అనేది గృహ హింస కాదా ? కానీ ట్రిపుల్ తలాక్ ఊసే ఎత్తకుండా జాగ్రత్తపడ్డాడు. బహు బార్యలు ఉండడం, అధిక సంతానం మీద మాత్రం మాట్లాడలేదు. దేశ జనాభా కారణం గా కొన్ని విషయాలు ప్రస్తావించాడు కానీ అధిక సంతానం మీద మాత్రం నోరు పెగలలేదు. నీటి సమస్య మీద మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం ని నిలదీశాడు కానీ రాజకీయ,సినీ ప్రముఖుల స్నానాల కోసం మీనరల్ వాటర్ పెద్ద మొత్తంలో వాడకాన్ని ప్రశించలేకపోయాడు పాపం. అసలు సత్యమేవ జయతే చూసిన ప్రేక్షకులు పాపం అమీర్ దేశం కోసం బాధపడుతున్నాడు ఉచితంగా అనుకున్నారు కానీ .......ఒక్కో ఎపిసోడ్ కి 3 కోట్లు తీసుకున్నాడు అలాగే ప్రతీ ఎపిసోడ్ ప్రోమోషన్ ఆడ్ కి 10 సెకన్ల కి 30 లక్షలు తీసుకున్నాడు. కానీ ఈ విషయం ఎక్కడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. 100 దేశాల్లో టే లీకాస్ట్ అయ్యింది తద్వారా ప్రకటనల రూపంలో వచ్చిన ఆదాయం లో తన వాటా ఎంతో చెప్పడు. దేశం కోసం కన్నీరు కార్చే నటులని నమ్మకండి. ఈ విషయం లో అమీర్ Mr.పెర్ఫెక్షనిస్ట్ .
2. 2018 లో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు భారత పర్యటనకి వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రధాని గౌరవార్ధం ముంబై లో షలోమ్ ఇండియా ఫెస్ట్ [Shalom India Fest ] జరిగింది. ఈ ఫెస్ట్ లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో పాటు ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజిమిన్ నేతన్యాహు పాల్గొన్నారు. బాలీ వుడ్ ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. అమితాబ్ బచ్చన్ తో సహా మిగతావాళ్లు ఆ ఫెస్ట్ కి హాజరయ్యారు. నేతన్యాహూ తో సెల్ఫీలు దిగారు కానీ అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లు మాత్రం హాజరవ్వలేదు ఎందుకంటే అరబ్ దేశాలకి కోపం వస్తుంది. ఇక్కడ భారత ప్రధాని ఆహ్వానం ని తిరస్కరించారు అరబ్ దేశాలతో పాటు పాకిస్తాన్ ని సంతృప్తి పరచడం కోసం. వీళ్ళు భారతీయులా ? ఇప్పుడు అదే ఇజ్రాయెల్ తో UAE కలిసిపోయి రక్షణ,వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నది మరి తల ఎక్కడ పెట్టుకుంటారు ఈ ఖాన్లు ? ఇక నుండి దుబాయి కేంద్రంగా నల్ల డబ్బు బాలివుడ్ లోకి రాదేమో ? అందుకే తమ కేంద్రాన్ని టర్కీ కి మార్చాలనుకుంటున్నారా ?
3.లాల్ చంద్ ఛడ్డా [ఫారెస్ట్ గంప్ - Forrest Gump ఇన్స్పిరేషన్ ]సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్ళాడు అమీర్ ఖాన్ సరే వెళ్లొచ్చు కానీ ప్రోటోకాల్ పాటించకుండా నేరుగా టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ ని ఎందుకు కలిసినట్లు ? టర్కీ లోని భారత రాయబార కార్యాలనికి వెళ్ళి తను టర్కీ అధ్యక్షుడు అతని భార్యని కలుస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వాలి , ఇది ప్రోటోకాల్ ఎందుకంటే అమీర్ ఖాన్ భారతీయుడు కనుక కానీ అసలు భారత రాయబార కార్యాలయానికి ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. పైగా టర్కీ వెళ్ళి అక్కడ నా భార్యకి ఈ దేశం చాలా బాగా నచ్చింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతం ? 2015 లో నా భార్య భారతదేశంలో ఉండడానికి భయపడుతున్నది అంటూ బహిరంగంగా వాగాడు దాంతో ప్రజలు తిరగబడం తెలిసిందే. అమీర్ బ్రాండ్ అంబాసడ ర్ ఉన్న ప్రముఖ కమపనీలకి ఆ సెగ బాగానే తగిలింది ముఖ్యంగా అప్పట్లో మాంచి ఊపు మీద ఉన్న ఆలైన్ పోర్టల్ స్నాప్ డీల్[Snap Deal ] కి ఆ సెగ బాగా తగిలి ఇప్పుడు సోదిలోకి లేకుండా పోయింది. అప్పటినుండి ప్రముఖ కంపనీలు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఖాంలని పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి.
5. ఈ ఖాన్ త్రయానికి బయటి దేశాలనుండి డబ్బు వచ్చే మార్గాలు ఇటీవలే బయటపడ్డాయి. విదేశాల్లో ఉండే ధియేటర్ యాజమాన్యాలతో ముంబై పొడక్షన్ హౌస్లు చాలా దగ్గర కనెక్షన్స్ ని కలిగి ఉన్నాయి. అక్కడ ధియేటర్ యాజమాన్యాలతో ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఖాన్ల సినిమాలు ఆడే ధియేటర్ లలో టిక్కెట్స్ పూర్తిగా అమ్ముడుపోకపోతే ఎన్ని సీట్లు మిగిలితే అన్నీ సీట్లకి టికెట్స్ చించేస్తారు వాటికి అయ్యే టాక్స్ కూడా కట్టేస్తారు. ఉదా : ఒక ధియేటర్ లో 500 సీట్లు ఉంటే 150 మంది ప్రేక్షకులు టికెట్స్ కొంటె మిగిలిన 350 ఫెక్ టికెట్స్ ని చిన్చేస్తారు. ఆ డబ్బుని రాజ మార్గంలో ఇండియా కి పంపిస్తారు అంటే హవాలా అని చెప్పలేరు ఎవరూ. దంగల్ విషయంలో చైనా లో ఇలానే చేశాడు అమీర్ . అక్కడ 5000 ధియేటర్ లు ఉంటే అన్నీ చోట్లా ప్రతి రోజూ హౌస్ ఫుల్ అనిపించారు. మొత్తంగా 380 కోట్లు కలెక్షన్స్ అనిపించారు. కాంగ్రెస్ కి చైనా తో ఉన్న బంధం ద్వారా ఈ అక్రమానికి తెర లేపారు. ఇప్పుడు చైనాతో మనకి బాగాలేదు కాబట్టి అక్కడ లాల్ చంద్ చద్దా రిలీజ్ చేయలేడు అలాగే పాకిస్తాన్ లో కూడా రిలీజ్ చేయలేడు. మిగిలింది అరబ్ దేశాలు కానీ ఇప్పుడు అవి సహకరించే స్థితిలో లేవు కాబట్టి టర్కీ వెళ్ళి అక్కడి దేశాధినేతతో మాట్లాడుకుంటే మొత్తం కాకపోయినా సగం పని అయినా జరిగిపోతుంది దొంగ టిక్కెట్ల ద్వారా. లేకపోతే అమీర్ ఏమన్నా హాలీవుడ్ నటుడా ? నేరుగా దేశాధినేతలని కలవడానికి ? పాకిస్తాన్ నుండి ఆదేశాలు,సూచనలు వస్తాయి అంతే !
6. మారిన పరిస్థితుల్లో దుబాయి నుండి వ్యవహారాలు నడిపే పరిస్తితి లేదు ఎందుకంటే అక్కడ ఇప్పుడు మొస్సాడ్ కి ఇంతకుముందుకంటే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇది పాకిస్తాన్ ISI కి తెలుసు కాబట్టే మకాం టర్కీ కి మార్చాడు దావూద్ ఇబ్రాహిం. కరణ్ జోహార్ , మహేశ్ భట్, ఖాన్ త్రయానికి దావూద్ గాంగ్ ద్వారా వచ్చే నల్ల డబ్బే పెట్టుబడి. ఏమాత్రం ఆధారం దొరికినా భారత్ అడగడమే ఆలస్యం దుబాయ్ ప్రభుత్వం వీళ్ళ ఆస్తులని అప్పచెప్పేస్తుంది. అమీర్ లాల్ చంద్ ఛాడ్డా టర్కీకి సంబంధం ఇదే. వీళ్ళ సినిమాలని చూడకుండా ఉంటే అదే వీళ్ళకి తగిన శిక్ష.
జైహింద్ !
Nive
ReplyDelete