Showing posts with label cultural. Show all posts
Showing posts with label cultural. Show all posts

క‌రోనా.... ఒక పెద్ద కుట్ర‌

*క‌రోనా.... ఒక పెద్ద కుట్ర‌*
🔥🔥🔥🔥

(ప్ర‌పంచాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన దుర్మార్గుల గురించి ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి)

అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఈ ప్రపంచంలో అన్ని సమస్యలకూ మూల కారణం పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇది అర్థం అయితే తప్ప మనకు ఏదీ సరిగా అర్థం కాదు. 

ఇప్పుడు ప్రపంచం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంతటి విశాల ప్రపంచంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, వాతావరణపరంగా, జీవనశైలిలో,  ఆచారవ్యవహారాల్లో, ఆహారపుఅలవాట్లలో ఇంకా అనేక విషయాల్లో ఒకదేశంతో మరొక దేశానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్ని దేశాలలో ఒకేరకమైన పరిస్థితి అనేది మానవుడు సృష్టిస్తే తప్ప సహజసిద్ధంగా వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈదేశం ఆదేశం అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం విషవలయంలో చిక్కుకుపోయింది. చిక్కుకుంది అనే కంటే ఛేదించలేని వలయాన్ని సృష్టించారు అనడమే కరెక్ట్. 

మానవ సమాజం అనేకసార్లు ఈ కరోనాకంటే వందరెట్లు భయంకరమైన సూక్ష్మజీవులనూ, రోగాలనూ ఎదుర్కొని పోరాడి నిలిచింది. కానీ సాంకేతికంగా, వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి, పురోగతి సాధించిన ఈ రోజుల్లో ఇంత బలహీనమైన వైరస్ కి (మరణాల రేటు 3% మించిలేని వైరస్ భయంకరమైనది అనడం అవివేకం. ఆ మరణాలలో కూడా 50% పైగా కేవలం వీరు సృష్టించిన భయంతో చనిపోయినవారే!) మానవజాతి సమస్తం ఛిన్నాభిన్నం అయ్యిందంటే దీని వెనక కచ్చితంగా కుట్ర దాగివుందనుకోవడంలో ఏ సందేహం ఉండాల్సిన అవసరం లేదు. 

*ఇమ్యూనిటీ పెంచే ఊసే లేదు*



మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ ఏనాడో చెప్పాడు. ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు లాభాలు తప్ప మరో ఆలోచన ఉండదు. డబ్బుకోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. కోవిడ్ మాత్రమే కాదు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే ఏ రోగానైనా మన శరీరం ఇమ్యూనిటీతోనే ఎదుర్కుంటుంది. మరి ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచే దిశగా ఏ దేశం అయినా చర్యలు చేపడుతోందా? అబ్బే అసలు ఆ ఊసే లేదే ! ఎవరి నోట విన్నా.... వ్యాక్సీన్, వ్యాక్సీన్, వ్యాక్సీన్. తొందరగా వ్యాక్సీన్ రావాలి. ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి. అప్పుడు కానీ ఈ కరోనాని తరిమికొట్టలేము అనే భయంకరమైన వాతావరణం క్రియేట్ అయ్యింది. 

మొన్న ఆ మధ్య WHO చేసిన ప్రకటన చూస్తే నాకు నవ్వొచ్చింది. చాలా మందిలో కరోనా ఉన్నప్పటికీ అసలు ఏ లక్షణాలూ కనిపించట్లేదట. ఇలాంటి వారి ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందని పాపం WHO బెంగపడిపోతోంది. అసలు లక్షణాలు కూడా బయటపడకుండా తగ్గిపోయే జబ్బు ప్రమాదకరం ఎలా అవుతుందో! ఇలాంటి జబ్బుకి వణికిపోతూ ప్రపంచం అంతా లాక్డౌన్ ఎందుకు విధించిందో WHO చెప్పగలదా?  చెప్పలేదు. ఎందుకంటే ఈ కుట్రలో WHO కూడా భాగం పంచుకుంది కాబట్టి.

*కుట్రలో ఎవరెవరు ?  దీని వల్ల వారికి లాభం?*

.

ఇది తెలుసుకునే ముందు మనం డాక్టర్ శివ అయ్యాదొరై గురించి కొంచం తెలుసుకోవాలి. డాక్టర్ శివ ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్. అమెరికాలోని MIT University లో Biological engineering లో PhD చేశారు. immunology మీద మంచి పట్టు ఉన్న ఈ మేధావి కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్ Anna Lorraine అనే మరో సైంటిస్ట్ తో కలిసి అమెరికాలో fake Scienceకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వీళ్ళు Anti vaccine Activists. ముఖ్యంగా కరోనా విషయంలో లాభాల కోసం ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన స్వార్థపరుల గుట్టుని రట్టుచేసి, ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ఆమెరికాలో ఉద్యమాన్నే నడుపుతున్నారు. 

డాక్టర్ శివ ప్రకారం ఈ వినాశనానికి కారణం. 

1. Bill gates (micro soft CEO), 

2.Dr. Fauci (USA Chief medical advisor) 

3. WHO

 ఇంకా... Dr.Fauci allies - Big Pharma, Clinton global Initiative, Chan-Zuckerberg, CDC. 

బిల్ గేట్స్ మెడికల్ రంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి. కానీ ఏ దేశంలో కొత్తగా ఏ రోగాలు పుట్టుకొచ్చినా, సేవ ముసుగులో అక్కడ ప్రత్యక్షమై వాటికి టీకాలు సిద్ధం చేసి బిలియన్ల డాలర్లు మూటగట్టుకునే వ్యక్తి. గేట్స్ ఫౌండేషన్ 2010లో అమెరికాకు చెందిన National Institute of Allergy and Infectious diseases (దీనికి డైరెక్టర్ Dr.Fauci), WHO తో కలిసి గ్లోబల్ వ్యాక్సీన్ ప్రాజెక్ట్ కోసం CEPI (Coalition for epidemic Preparedness Innovations) అనే సంస్థను స్థాపించారు. ప్రతీదానికీ వ్యాక్సీన్ తయారు చేసి మార్కెట్లో పెట్టడమే ఈ సంస్థ ఉద్దేశం. విచిత్రమేమంటే ఈ సంస్థ MERS-Cov, SARS-Cov-2, Nipah virus, Lassa fever virus, Rift Valley virus, Chikungunya లాంటి వాటి వ్యాక్సీన్ మాత్రమే కాదు, ఇంతవరకు అసలు తెలియని ఫ్యాథోజన్ అసలు ఉనికిలో లేని దానికి కోసం కూడా "Disease X"  పేరిట వ్యాక్సీన్ తయారీకి పూనుకుందంటే ఈ సంస్థ దేనికోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

బిల్గేట్స్ HIV విషయంలో కూడా తప్పుడు సైన్స్ ని ప్రచారం చేసి, HIV కచ్చితంగా AIDS కి దారితీస్తుందనే భయాన్ని కలిగించి ACTI, IV drugs ప్రజలకు ఇచ్చేవారని దీనివల్ల శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని చాలామంది చనిపోయారని శివ ఆరోపిస్తున్నారు. 

అసలు  వ్యాక్సిన్ అనేది అవసరమైతే తప్ప తీసుకోకూడదని, ఆహారంతోనే (విటమిన్లతోనే) వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలని ఈ విషయం వైద్యరంగానికి చెందిన Dr. Fauci కి బాగా తెలుసని, కానీ డబ్బుకోసం ఫేక్ సైన్స్ ప్రచారం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని శివ అంటున్నారు. 

ఇదే విషయాన్ని ఆయన ట్రంప్ కి రాసిన లెటర్లో పేర్కొన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ కరోనా పరిస్థితిలోనైనా అసలైన సైన్స్ ని ప్రజలకు చెప్పండి, ఇమ్యూనిటీకి సంబంధించి నిజాలను ప్రజలకు చెప్పి భయాన్నిపోగొట్టండని ట్రంప్ కి సూచించారు. కోవిడ్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవచ్చో ఆయన కొన్ని పాయింట్లను లెటర్లో పేర్కొన్నారు. ఇవి చాలా సింపుల్ గా ఉన్నాయి. డాక్టర్ Anna Lorraine కూడా ట్రంప్ కి రాసిన లెటర్లో ఇప్పుడు ప్రపంచం ఫాలో అవుతున్న పద్ధతి కరెక్టని ఫార్మాకంపెనీలతో సంబంధంలేని, తమకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేని సైన్స్ ఎక్స్ పర్ట్స్ ఒక పది మందితో చెప్పించండని చూద్దాం అని సవాలు విసిరారు.

*గుడ్డిగా నమ్మేస్తున్నారు*


ఇప్పుడు ప్రతిఒక్కరూ డాక్టర్లు అయిపోయారు. ఎవరకిి తోచింది వారు చెప్పేస్తున్నారు. చాలా వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నాం. కానీ ఎపిడెమాలజిస్టులు, ఎక్స్ పర్ట్స్  చెబుతున్న మాటలు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. 

ఈ వైరస్ కి ఎక్స్ పోజ్ కాకుండా దాక్కోవడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలం అవుతుందని ప్రముఖ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ జయప్రకాష్ ముల్లియర్ చెప్పారు. శివ అయ్యాదొరై కూడా అదే చెబుతున్నారు. 

కానీ నిపుణుల గోడు వినే పరిస్థితిలో ఇప్పుడు ప్రపంచం లేదు. ప్రపంచం బిల్ గేట్స్  కనుసన్నలలోనే నడుస్తోంది. భారతదేశాన్ని అంబానీ ఎలా శాసించగలడో ప్రపంచాన్ని బిల్ గేట్స్ అలా శాసించగలడు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ( WHO) అతడు చెప్పినట్టే వినాలి .  అతన్ని కాదని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అక్కడ లేదు అని వైట్ హౌస్ కరెస్ఫాండెట్ ప్రకటించింది. ఆయన ఇప్పటికే వ్యాక్సీన్ తయారీ కోసం 7 లాబ్స్ నిర్మించి సైంటిస్ట్లను ఆ పనికి ఎప్పుడో పురమాయించాడని. ఇప్పుడు ఆ వ్యాక్సీన్ మార్కెట్లోకి వస్తేనే ఈయనగారికి బిలియన్ బిలియన్ డాలర్ల లాభం వస్తుందని ఆవిడ చెప్పారు. అందులో .Dr. Fauci లాబ్ ఒకటి.

 ప్రపంచంలో మరే దేశం వారు కోవిడ్ కి వ్యాక్సీన్ కనిపెట్టినా దాన్ని మార్కెట్లోకి రాకుండా, వీళ్ళది మాత్రమే వచ్చేలా చూసుకోవాల్సిన పని చూడా వీళ్ళ మీద పడింది. 

బిల్ గేట్స్ పెద్ద జోతిష్కుడుక్బి 

బిల్ గేట్స్  2015లో టెడ్టాక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే 3,4 సంవత్సరాల్లో అతి భయంకరమైన వైరస్ ఒకటి రాబోతోందని, దీంతో 6 నెలల్లోనే మూడు కోట్ల మంది చనిపోతారని చెప్పాడు. దీనికి వ్యాక్సీన్ కనిపెట్టడంలో వాళ్ళ సంస్థ నిమగ్నమై ఉందని, భారీగా విరాళాలు కావాలని చెప్పాడు. ఆయన భార్య మిలిందా గేట్స్ కూడా ఇదే మాట చెప్పింది. ఆ వైరస్ అతి భయంకరమైందని అది అంత తొందరగా పోదని, వ్యాక్సీన్ తప్పనిసరి అని చెప్పింది. ఇప్పుడు వచ్చిన కోవిడ్ 19 అదే. మరి ఈ విషయం వీళ్ళకు అన్ని సంవత్సరాల ముందుగానే ఎలా తెలిసింది?  వైరస్ రాకముందే వ్యాక్సీన్ ఎలా కనిపెట్టాలనుకున్నారు?  వీటికి సమాధానం కొంచం బుర్రపెడితే ప్రతీ ఒక్కరికీ ఈజీగానే అర్థం అవుతావు.

వీళ్ళు అనుకున్నట్టు లాభాలు రావాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరూ వ్యాక్సీన్ తీసుకోవాలి. చిన్నాచితకా జబ్బులకు టీకా తీసుకోవాలని సామాన్యులు అనుకోరు. అందుకే ఇంతటి భయంకర వాతావరణం. ప్రపంచం అంతా లాక్డౌన్. ట్రంప్ అయినా, జాన్సన్ అయినా మరే పెట్టుబడిదారీ దేశమైనా బిల్ గేట్స్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. అందుకే Dr. Fauci అమెరికా ప్రజల్ని, ప్రభుత్వాన్నీ తప్పుదారి పట్టించాడు. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నాడు. ఈయనకు ట్రంప్ సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ అనుచరులే ఫౌసిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ట్రంప్ కొంచం తగ్గక తప్పని పరిస్థితి. 

*చ‌నిపోవ‌డం మంచిదే!*

ఇంకా భయంకరమైన విషయమేమంటే, బిల్ గేట్స్  depopulation గురించి మాట్లాడ్డం. ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది కాబట్టి ఇలాంటి వైరస్ లు వచ్చి చాలా మంది చనిపోతే (ప్రపంచ జనాభాలో సగం మంది. అది కూడా పేద ప్రజలు) చాలా మంచిది అని  చెప్పాడు. అంతేకాదు, వీళ్ళ వ్యాక్సీన్లలో కొన్ని రకాల మందులు వాడుతున్నారట, వాటి వల్ల ఫర్టిలిటీ రేట్ (సంతానాన్ని పొందే సామర్థం) గణనీయంగా తగ్గిపోతుందట. ఇలా depopulation పనులు చేపట్టారని (ఆ మందులు పరీక్షిస్తే తెలుస్తుందని) డా.శివ అయ్యాదొరై అంటున్నారు. 

*కరోనా ప్రాణాంతకమైనది కాదు* 

*కరోనా అనేది అతి సాధారణమైన జలుబు, జ్వరం లాంటి చిన్న జబ్బు. కొందరి స్వార్థం కోసం దీన్ని పెద్ద భూతాన్ని చేసి, భూతద్దంలో చూపిస్తున్నారు. ఇతర జబ్బులు ఏమీ లేకుండా,ఒక ఆరోగ్యవంతుడు కేవలం ఈ వైరస్ సోకి చనిపోయిన కేసు ఒక్కటి కూడా లేదు. జబ్బుకంటే భయంతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తెలియగానే చాలామంది ఇక చావు తప్పదని వణికిపోతున్నారు. భయం వల్ల స్ట్రెస్ విపరీతంగా పెరిగి శరీరంలో ఇమ్యూన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. లక్షలాది మంది చాలా తేలికగా దీని నుంచి బయటపడుతున్నారు. కోవిడ్ పట్ల అవగాహన పెంచుకుని ధైర్యంగా ఉంటే వారిలో మనం కూడా తప్పకుండా ఉంటాం. కేవలం వయసుపైబడిన, రిస్క్ ఉన్నవారి మీద దృష్టి పెట్టి (మన దేశంలో వృద్ధుల సంఖ్య పది శాతానికి మించి లేదు), ప్రభుత్వం వారిని కాపాడడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే రిస్క్ గ్రూప్ లో కూడా మరణాలు చాలా తగ్గించే అవకాశం ఉండేది. కానీ మనవి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు కదా వాళ్ళ కోసమే పనిచేస్తాయి. మనకోసం కాదు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి*

*అవగాహన, ధైర్యానికి మించిన ఆయుధం లేదు!*









బ్యాంకు యాజమాన్యం రైతులపై ఒత్తిడి



                                 బానోత్ బిచ్చ


ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ రైతు పేరు బానోత్ బిచ్చ
ఊరు ఇల్లందు మండలం లోని కొమరవరం దగ్గర బిచ్చ తండ 
ఈ రైతు 2019లో మూడున్నర తులాల బంగారు ఆభరణము ను ఆంధ్ర బ్యాంకు లో గోల్డ్ లోన్ కింద పెట్టి నగదు పొందినాడు అనంతరం  ఈ సంవత్సరం 2020 మార్చి నెలలో గోల్డ్ లోన్ వేలంపాటలో పోతుందని భయపెట్టి ఆంధ్ర బ్యాంకు యాజమాన్యం ఇతని పై ఒత్తిడి తీసుకొచ్చి మార్చిలో తన చేత మొత్తం గోల్డ్ లోన్ అమౌంట్ కట్టించుకుంది కానీ ఈ రైతు బంగారు ఆభరణాలు ఇవ్వలేదు తన గోల్డ్ లోన్ డబ్బులు కట్టిన తన ఆభరణం ఇవ్వమని రైతు అడుగగా తన కట్టింది క్రాఫ్ లోనే గోళ్లను గోళ్లను అలానే ఉందని అది క్లియర్ చేస్తేనే ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో ఆ రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు కు  డబ్బును యాజమాన్యం  వారు క్రాప్  లోన్ కట్ చేసుకుని ఆ రైతుకు ఇప్పటివరకు తన బంగారు ఆభరణాలు ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది అని  చెపుతున్నా మరి బ్యాంకు యాజమాన్యం రైతుల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోరు ఈ ప్రభుత్వ పెద్దలు ఎందుకు సమస్యలు పరిష్కరించారు 

 లక్షల కోట్లతో బ్యాంకుల సొమ్ముతో పరారై విదేశాలకు పారిపోతున్న బడాబాబులు పట్టించుకోని బ్యాంక్ యాజమాన్యాలు ఇలా చిన్న సన్నకారు రైతుల పై తన ప్రతాపాన్ని చూపడం ప్రభుత్వాలు దాన్ని తమాషాగా చూడడం ఈ సమాజంలో ఒక ఫ్యాషన్గా మారింది ఇకనైనా ఈ రైతుకు న్యాయం చేయవలసిందిగా తను కట్టిన గోల్డ్ లోన్ అమౌంట్ ని తీసుకునా యాజమాన్యం క్రాఫ్ లోన్ గా రైతుకు తెలియకుండా కట్టిన బ్యాంక్ యాజమాన్యాని దీన్ని రైతులను మోసం చేయడం భావించి యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఆ రైతుకు న్యాయం జరిగేలా తన బంగారు ఆభరణాన్ని ఇప్పించ వలసిందిగా  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 








కరోనాను జయించి తిరిగొచ్చా




బ్యాంకు అకౌంట్‌.. బాకీల వివరాలు భార్యకు వివరించా

కరోనాను జయించి తిరిగొచ్చా..

స్థానికుల తీరు కలచివేసింది

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిసి ఆస్పత్రికి వెళ్లాను. బతుకుతానో లేదో అనే అనుమానంతో మానసికంగా కుంగిపోయాను. అయినా ధైర్యం తెచ్చుకుని అడుగులు వేశాను. ఇంటి నుంచి బయలుదేరుతున్న సమయంలో తల్లిని, భార్యను, ఆరేళ్ల పాపను, 15నెలల బాబును కళ్లారా చూసుకున్నాను. మళ్లీ వారిని చూస్తానో లేదో భగవంతుడికే తెలియాలని మనస్సులో ప్రార్థించుకున్నాను. ఎంతో బాధగా ఇంటి నుంచి వెళ్తున్న ఇలాంటి సందర్భం పగవాడికి కూడా రాకూడదని కోరుకున్నాను. నా బ్యాంకు ఖాతా వివరాలు... ఉద్యోగం చేస్తున్న సంస్థ పీఎఫ్‌ వివరాలు... రావాల్సిన బాకీలు... నేను బాకీ ఉన్న వ్యక్తుల వివరాలు... ఏటీఎం పిన్‌ నెంబర్‌, సెల్‌ఫోన్‌ పాస్‌వర్డ్‌ అన్నీ నా భార్యకు ఇస్తున్నప్పుడు ఆమె కన్నీరు కార్చడం చూసి తట్టుకోలేకపోయాను. అయినా తప్పదని ఆస్పత్రిలో చేరాను. కానీ దేవుడు నాపై, నా కుటుంబంపై కరుణించాడు. ఆరోగ్యంగా ఇంటికి తిరిగొచ్చాను. క్వారంటైన్‌ పూర్తి చేసి గత ఐదు రోజులుగా విధులకు హాజరవుతున్నాను. భౌతిక దూరం పాటిస్తూ కుటుంబీకులు, స్థానికులతో జాగ్రత్తగా ఉంటున్నాను. అయినా బస్తీ వాసులు మాత్రం మానసికంగా హింసించడం నన్ను ఎంతో కుంగదీసింది. ప్రపంచంలో కరోనా నుంచి కోలుకుంటున్న వ్యక్తులను సాదరంగా ఆహ్వానిస్తున్న సమాజంలో మా బస్తీవాసులు మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం జీర్ణించుకోలేక పోయాను.’’ అంటూ అంబర్‌పేట ప్రాంతానికి చెందిన ప్రైవేటు సంస్థ ఉద్యోగి పరశురాం (పేరు మార్చాం) పాజిటివ్‌ నుంచి కోలుకున్న తర్వాత చెప్పిన మాటలు ఇవి.

*ఆవహించిన భయం*

కరోనా వ్యాప్తి గురించి నిత్యం గమనిస్తూనే ఉన్నాను. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట నిర్లక్ష్యం జరిగింది. గత నెల 6న డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి జ్వరంగా అనిపించింది. జ్వరమే కదా అని కాస్త నిర్లక్ష్యంగా ఓ మెడికల్‌ షాపునకు వెళ్లి పారాసిటమాల్‌ తెచ్చుకున్నాను. రాత్రయ్యేసరికి కాస్త తగ్గింది. మరుసటి రోజు డ్యూటీకి వెళ్లాను. సాయంత్రం ఆఫీసులో ఉన్నప్పుడే అలసట వచ్చి... ఒళ్లు వేడెక్కింది. అనుమానంతో ఇంటికి వచ్చాను. భార్యకు చెప్పి పక్క గదిలో బస ఏర్పాట్లు చేసుకున్నాను. ఇంట్లో వారందరితో భౌతిక దూరం పాటించాను. ఉదయం కాస్త తగ్గినట్లు అనిపించి, అనుమానంతోనే మరుసటి రోజు ఆఫీసులో పరిస్థితిని వివరించగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని మా విభాగం హెడ్‌ సూచించారు. దాంతో జూన్‌ 8న  ఆస్పత్రికి వెళ్లాను. వివరాలు తీసుకుని టెస్టు నిర్వహించారు. ఒక్క రోజు చాలా టెన్షన్‌తో గడిపాను. మరుసటి రోజు పాజిటివ్‌ అనే సమాచారం అందింది. భయాందోళనలతో పాటు మరింత టెన్షన్‌కు లోనయ్యాను. ఇంట్లో చిన్న పిల్లలున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదమేనని భావించి ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 



*భారమైన గుండెతో...*

ఇంటికి వెళ్లి కొంత సామాను సర్దుకున్నాను. నేను ఆస్పత్రికి వెళ్తూ గేటు వరకు వచ్చిన తల్లి, భార్యాపిల్లలను చూసుకుంటూ కన్నీరు ఆపుకుంటూ ఆటో డ్రైవర్‌కు కూడా వివరాలు చెప్పి.. ఎక్కడా ఆటోను టచ్‌ చేయకుండా ఫీవర్‌ ఆస్పత్రికి చేరుకున్నాను. మూడు నాలుగు గంటల పాటు ఫీవర్‌ ఆస్పత్రిలో వెయిట్‌ చేసిన తర్వాత నాతో పాటు మరో ఇద్దరు జూన్‌ 9న అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాము. ఆ రాత్రి ఫీవర్‌లోనూ... గాంధీలోనూ ఎక్కడా భోజనం ఇవ్వక పోవడంతో ఆకలితోనే నిద్రకు ఉపక్రమించాల్సి వచ్చింది. 



*మూడు రోజులు గాంధీలో*

ఉదయం ఇడ్లీ, ఉప్మా లాంటి టిఫిన్‌.. మధ్యాహ్నం రైస్‌, కర్రీ, దాల్చాతో లంచ్‌. రాత్రికి రైస్‌, కర్రీ, దాల్చాతో కూడిన భోజనం ఇచ్చారు. మధ్యలో టీ, బిస్కెట్స్‌తో పాటు సాయంత్రం డ్రైఫ్రూట్స్‌ ప్యాకెట్స్‌తో పాటు రోజుకు మూడు మాత్రలు మూడు సార్లు వేసుకునేలా ఇచ్చారు. టిఫిన్‌, ఆహారంలో ఎక్కడా సమస్య లేదు. తొలి రోజు (జూన్‌ 10న) ఉదయం ఓ నర్సు వచ్చి రక్త నమూనా సేకరించారు. ఆ తర్వాత మూడు రోజులు (జూన్‌ 10, 11, 12) గాంధీలో ఉన్నాను. ఎప్పటికప్పుడు వైద్యులు వచ్చి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జూన్‌ 11న నా భార్యకు తీవ్ర జ్వరం వచ్చిందని తెలియడంతో భయపడ్డాను. బావమరిదికి కాల్‌ చేసి వెంటనే మందులు చేరేలా ఏర్పాట్లు చేసి భార్యకు, పాపకు టెస్టులు చేయించుకోమన్నాను. వారికి నెగెటివ్‌ రావడంతో మనసు కాస్త కుదుట పడింది. జూన్‌ 11న ఓ వైద్యుడు వచ్చి ఇంటికి వెళ్తారా అని ప్రశ్నిస్తే.. చిన్నపిల్లలున్నారు సార్‌ అని సమాధానమిచ్చా. ఎట్టకేలకు జూన్‌ 12న డిశ్చార్జి చేయమని కోరగానే డిశ్చార్జి లెటర్‌ ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం బయటకు వచ్చి వైద్యులు రాసిచ్చిన మాత్రలు కొనుక్కుని 12గంటలకు బయలుదేరి ఆటోలో (భౌతిక దూరం పాటిస్తూనే) అంబర్‌పేటలో ఇంటికి చేరుకున్నాను.


*స్థానికంగా నిరాశ*

డిశ్చార్జి అయి వస్తుంటే ఇరుగు పొరుగు వారు ఆనందంగా పలకరిస్తారని భావించాను. కానీ నేను వస్తున్నట్టు సమాచారం అందగానే ఇరుగు పొరుగు వారు ఇంటి లోపలి నుంచి కొక్కెం పెట్టుకున్నారు. మరి కొందరు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అది చూసి చాలా బాధ అనిపించింది. భౌతిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ నన్ను చూడటానికే భయపడుతున్న వైనంతో మరింత కుంగిపోయాను. వైద్యుల సూచనల మేరకు జూన్‌ 25వరకు ఇంట్లోనే క్వారంటైన్‌ చేయాల్సి ఉన్నందున ఓ గదిని పరిమితం చేసుకున్నాను. అదే రూంలో టీవీ, వ్యాయామ సామగ్రి తెచ్చుకున్నాను. గదికి ఉన్న ఓ కిటికీ తెరుచుకుని ఉంచుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు దాన్ని కూడా బంద్‌ చేయాలని డిమాండ్‌ చేయడం మరింత బాధ కలిగించింది. చివరకు ఓ స్థానిక గల్లీ నాయకుడు ఫోన్‌ చేసి కిటికీ బంద్‌ చేయాలని కోరడం గమనార్హం. నాకు పాజిటివ్‌ వచ్చినందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా నా ఆరోగ్యం గురించి కనీసం పలకరించని స్థానికులు, మరో రకంగా ప్రవర్తించిన వైనం కలచివేసింది. 



*డ్యూటీలో జాయిన్‌ అయ్యా*

జూన్‌ 25 వరకు క్వారంటైన్‌ చేయమని వైద్యులు చెప్పినప్పటికీ... జూన్‌ 30 వరకు గది నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ నెల 1న విధుల్లో జాయిన్‌ అయ్యాను. అయినా ఇప్పటికీ ఇంట్లోనూ.. పని చేసే చోటా భౌతికదూరంతో పాటు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఫీల్డ్‌ వర్క్‌ ఉన్నందున ఆఫీసులో అడుగు పెట్టకుండా బయట నుంచే డ్యూటీ పూర్తి చేసి ఇంటికి వచ్చి టీవీ.. వ్యాయామంతో కాలక్షేపం చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రతిరోజూ ఆరోగ్య శాఖ వారు ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఎంతో భయపడినప్పటికీ... కోలుకుని బయటకు రావడం.. నా కుటుంబీకులతో కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. నేను అందరికీ సూచిస్తున్నదేమిటంటే కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఒకవేళ కరోనా సోకితే ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దు. ఇతర రోగాలు ఏమీ లేకుంటే సొంతంగా క్వారంటైన్‌ పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే కరోనాను జయించవచ్చు.

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...