ఓపిక తో ఒకసారి చదవండి /---లోకసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు కి నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పంజాబ్ కి చెందిన అకాలీదళ్ లోక్ సభ సభ్యురాలు శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు -
భయంతో దేశం వదలి దుబాయి వెళ్లిపోతున్న బాలీ వుడ్ నటీ నటులు....
*రెండూ వేరేవేరు ఘటనలు కానీ ఉమ్మడిగా ఒకే అంశం ఉంది పై రెండు విషయాలలో....*
*కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ బిల్లు,*
క్లుప్తంగా బిల్లు యొక్క లాభాలు ఏమిటో చూద్దాం.
*ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం మధ్య దళారీల నుండి రైతులని రక్షించడం కోసం ఉద్దేస్యించినది.*
దీనివల్ల దేశం లో ఉన్న 80% చిన్న,సన్నకారు రైతులకి మేలు కలుగుతుంది.
*మధ్య దళారీలు , కమిషన్ ఏజెంట్ల ని రైతులకి దూరంగా ఉంచుతుంది ఈ బిల్లు.*
తను పండించిన పంటకి తానే ధర నిర్ణయించుకునే వెసులుబాటు ఇస్తుంది ఈ బిల్లు. అలాగే దేశంలో ఎక్కడయినా తమ పంటని అమ్ముకునే స్వేచ్చని ఇస్తున్నది ఈ బిల్లు. ఈ బిల్లు వల్ల నష్టపోయేది కమిషన్ ఏజెంట్లు, పెద్ద ఎత్తున కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమే . అయితే ప్రధానంగా పంజాబ్ & హర్యానాలలో వసూలు చేసే *'మండి టాక్స్ ' [మండి అంటే మార్కెట్టు ] ని కోల్పోతాయి అందుకే వీళ్ళు గొడవ చేస్తున్నారు*
కానీ రైతులమీద వీళ్ళకి ప్రేమ ఉంది కాదు. రైతులని దోచుకోవడానికి ఉన్న రాజ మార్గం మూసుకుపోతున్నది ఈ బిల్లు వల్ల. ముఖ్యంగా పంజాబ్,హర్యానా రాష్ట్రాలకి మండీ టాక్స్ వల్ల గణనీయమయిన పన్ను రెవెన్యూ రూపంలో వస్తున్నది ఇప్పటివరకు కానీ ఈ బిల్లు వల్ల ఆ ఆదాయం రాదు ఇకమీదట.
ఇప్పటివరకు దళారీలు,మార్కెట్ కమిటీలు నిర్ణయించిన ధర కె అమ్ముకోవాల్సి వస్తున్నది ఒక్కో సారి పంటకి అయ్యిన ఖర్చు,రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు అవట్లేదు. దళారీలు అందరూ సిండికేట్ అయి రైతులని ముంచుతున్నారు. ఈ అగ్రి బిల్ ప్రకారం రైతు తన పంటని ఎవరికయినా అమ్ముకోవచ్చు. తన పొలం దగ్గరే తనకి నచ్చిన ధరకి అమ్ముకోవచ్చు ఎవరికయినా. ముదస్తుగా ఒప్పందం చేసుకొని ఎవరికి ఏ పంట ఎంత కావాలో ఆ పంట వేసి వాళ్ళకి నేరుగా అమ్ముకోవచ్చు . దీనివలన తన పంటని తన పొలం దగ్గరే అమ్ముకోవడం వల్ల రవాణా ఖర్చు ఉండదు , రోజుల తరబడి మార్కెట్ యార్ద్లలో కొనేవాడి కోసం ఎదురుచూడడం అనేది ఇక ఉండబోదు. పైగా మార్కెట్ పన్నులు ఉండవు.
*అత్యవసర వస్తువుల చట్టం*
*The essential commodities (Amendment) Bill, 2020* వల్ల తృణ ధాన్యాలు,పప్పులు. ఆయిల్ సీడ్స్ , వంట నూనెలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు లాంటి వాటిని తీసేస్తున్నారు,
*ఇప్పటివరకు ఎస్సెన్షియల్ కొమొడిటీస్ యాక్ట్ కింద ఉన్నాయి అంటే వీటి అమ్మకాలమీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉండేది అది ఇప్పుడు ఉండదు.* అలాగే రైతులు పండించిన తమ పంటని తనకి నచ్చిన ధర వచ్చేవరకు నిల్వ చేసుకోవచ్చు వీటి మీద ఎలాంటి ఆంక్షలు ఇక ముందు ఉండబోవు. అంటే ఎంత స్టాక్ చేసుకోవాలో లిమిట్ అనేది ఉండబోదు. దీనివల్ల విదేశాలనుండి పెట్టుబడులు వస్తాయి వ్యవసాయ రంగానికి అలాగే ప్రైవేట్ సెక్టార్ నుండి నిధులు రైతులకి లభిస్తాయి. పెద్ద పెద్ద సంస్థలు తమకి కావాల్సిన పంట కోసం రైతులతో ఒక ధర నిర్ణయం చేసుకొని ముందుగా అడ్వాన్స్ చెల్లిస్తారు పంట చేతికి రాగానే వాళ్ళే తీసుకెళ్తారు. రైతుకీ డబ్బు,రవాణా , మార్కెట్ పన్ను లాంటివి ఉండవు.
*FDI [Foriegn Direct Investments ] లు మన రైతులమీద పెట్టుబడులు పెడతారు ఇది చాలా ముఖ్యమయిన అంశం.*
*ఎవరు వ్యతిరేకిస్తున్నారు ? మధ్య దళారీలు, కమిషన్ ఏజెంట్లు, రైతులకి అధిక వడ్డీలకి అప్పులు ఇచ్చే వాళ్ళు.* వీళ్ళందరికీ ఆయా రాష్ట్రాలలో ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉంటున్నది అలాగే వీళ్ళు రాజకీయ పార్టీలకి విరాళాల రూపంలో డబ్బు ఇచ్చి ప్రభుత్వ అండ తీసుకుంటున్నారు.
*BKU [ భారతీయ కిసాన్ యూనియన్ ],*
*All India Kisan Sangarsh Co ordination Committee (AIKSCC),*
వీళ్ళు ఆందోళన బాట పట్టడానికి కారణం రైతుల మీద ప్రేమ కాదు ఇప్పటికే పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉన్న బడా బాబులకి సహాయం చేయడానికి ఎందుకంటే చిన్న రైతుల చేతుల్లోకి డబ్బు వస్తే వీళ్ళ మాట వినరు కనుక. ఇక *మహారాష్ట్ర కి చెందిన 'శేత్కారీ సంఘటన' ఈ బిల్లుని సమర్ధిస్తున్నది.*
పంజాబ్ హర్యానాలలో అకాలీదళ్ కి చెందిన వాళ్లే ఎక్కువగా కమీషన్ ఏజంట్లు లేదా మధ్య దళారీలుగా ఉన్నారు వీళ్ళ ఆదాయం వందల కోట్లలో ఉంటుంది ప్రతీ సంవత్సరం. అలాగే మార్కెట్ లేదా మండీ టాక్స్ ఎక్కువగా వసూలు అయ్యేది పై రెండు రాష్టాలలో అదీ హరి సిమ్రత్ కౌర్ గారి రాజీనామాకి రెండవ కారణం. మొదటి కారణం డ్రగ్స్ .
పాకిస్తాన్ నుండి పంజాబ్ ద్వారా ఎక్కువగా డ్రగ్స్ స్మగుల్ అవుతున్నాయన్నది గత 20 ఏళ్లుగా అందరికీ తెలిసిన నిజం. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఎక్కువభాగం అకాలీదళ్ కి చెందివ వారే ఎక్కువగా ఉన్నారు. SSR హత్య కేసు లో డ్రగ్స్ పాత్ర బయటపడి వాటి సూత్రధారుల పేర్లు ఇప్పటికీ బయటికి రాకపోయినా ముందు ముందు పంజాబ్ కి చెందిన అకాలీ దళ్ నేతల మెడకి చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి అందుకే అప్పుడు బయటపడ్డాక వెళ్ళే కంటే ముందే వ్యవసాయ బిల్లు మీద నిరసనగా వెళ్తే మంచిదని అకాలీ దళ్ ముందస్తు ఆలోచన.
*పది రోజుల క్రితం మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని స్వయంగా హోం మంత్రే ప్రకటించాడు* కానీ ఆ ఫోన్ కాల్ ని RAW విన్నదని తెలియగానే ప్రకటన చేశారు కానీ లేకపోతే ఆ విషయం రహస్యంగానే ఉండిపోయేది. బాలీవుడ్ డ్ర గ్గిస్టులని కాపాడాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ ఫోన్ కాల్ బెదిరింపు. NCB రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందనీ వేడుకోలు. సొ ! రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు కాబట్టి స్వయంగా D గాంగ్ అనుచరులు బాలీవుడ్ డ్రగ్గిస్టుల రక్షన బాధ్యత తీసుకున్నారు. దుబాయ్ లో IPL మాచులు చూడడానికి అని చెప్పి ఒక్కొరూ జారుకున్నారు. డ్రగ్స్ వ్యవహారం కొంచెం చల్లబడ్డాక తిరిగి రావాలని ప్లాన్. అప్పటివరకూ దుబాయ్ లో D గాంగ్ అనుచరుల నీడలో సేదతీర్చుకోవచ్చు. దావూద్ కి బాలీవుడ్ లో చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఉంది. దానితో పాటు డ్రగ్స్ వ్యాపారం కూడా వీళ్ళవల్లనే సజావుగా సాగిపోతున్నది కాబట్టి వీళ్ళని తాత్కాలికంగా అయినా కాపాడుకోవాల్సిన బాధ్యత దావూద్ కి ఉంది. అలాగే పంజాబ్ లో ఉన్న డ్రగ్స్ పేడలర్స్ ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇదో పెద్ద వలయం ఒకదానితో ఇంకోటి లింక్ ఉన్నాయి.
కరణ్ జోహార్ గోవా వెళ్లిపోయాడు. సంజయ్ దత్ అతని ఫామిలీ, సల్మాన్ ఖాన్ ఫామిలీ అతని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు , ఇంకా చాలమందే లిస్ట్ లో ఉన్నారు. నిజానికి రేపో మాపో కరణ్ జోహార్ ని ప్రశించడానికి సిద్ధంగా ఉంది NCB. కరణ్ ఇంట్లో తరుచూ జరిగే పార్టీలలో ఖరీదయిన మద్యం తో పాటు డ్రగ్స్ కూడా ఇస్తాడు. ఇటీవలే ఒక వీడియో వైరల్ అయ్యింది కరణ్ ఇంట్లో జరిగినట్లుగా అందులో ప్రముఖ నటీ నటులు డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు స్పష్టంగా. నిజానికి ఒక చిన్న క్లిప్ మాత్రమే బయటికి వచ్చింది కానీ మొత్తం వీడియో ఇప్పుడు CBI,NCB ల చేతిలో ఉంది. ముంబై లో ipl జరిగితే ఎవరూ రారు కానీ దుబాయ్ లో IPL కి వీళ్ళు వెళ్ళడం అంటేనే అర్ధమవుతున్నది. కనీసం ఓ రెండు నెలలు ఆదాయం లేకపోయినా సరే దుబాయ్ లో ఉండి తాత్కాలికంగా CBI,NCB ల నుండి దూరంగా ఉండొచ్చు అని వీళ్ళ ఆశ.
గత అయిదు నెలలుగా ఆదాయం లేకపోయినా నెల లేదా రెండు నెలలు దుబాయ్ లో విలాసవంతంగా గడిపెంత డబ్బు వీళ్ళ దగ్గర ఉందా అన్నదే ప్రశ్న.
పనిలో పనిగా వాణిజ్య ప్రకటనల కోసం ప్రస్తుతం వీళ్ళని ఎవరూ అడగట్లేదని వార్త.
ఇప్పుడు యాడ్ ఏజెన్సీలు అన్నీ కూడా క్రికెటర్ల వెంట పరిగెడుతున్నాయి.
ఇదో మంచి వార్త .
డ్రగ్స్ వ్యవహారం అటు రాజకీయ,సినీ రంగాలకి బాగానే సెగ చూపిస్తున్నది...
*జై హింద్ !*🇮🇳💐💐💐
No comments:
Post a Comment