LRS కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
ర్టీ రాష్ట్ర పార్టీ మేరకు కొణిజర్ల మండలం అధ్యక్షుడు మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం తీసుకొస్తున్న ఎల్.ఆర్.ఎస్ విధానం పేద, మధ్య తరగతి ప్రజలకు నడ్డి విరిచే లా ఉంది. ఈ ఎల్.ఆర్.ఎస్ విధానాన్ని టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం రద్దు చేయాలని కొణిజర్ల మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్. ఆర్. ఎస్ విధానం వలన పేద్ ప్రజలకి ఇబ్బందికరంగా మారుతుంది అని,ప్రజలకు తెలియకుండానే రక్తం పీల్చేలా ఉంటుందని. టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం మాట్లు చెప్పటమే గాని చేసేది ఏమీ లేదు అని, సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైరా నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేష్, తుప్పతి రామారావు, కవిడ రాము, మరిదు వేణు, ఉపుతాల రామారావు, గంజి రాజేష్, బండి శైదులు, జగపతిబాబును, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment