టి మీడియా భద్రాచలం.
వరద ముంపునకు గురైన అశోక్ నగర్ కొత్త కాలనీ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రం నన్నపనేని స్కూల్ కి తరలించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే పొందెను వీరయ్య ఆదేశానుసారం భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సరళ నరేష్ వెళ్లి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలిగిన మా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బలుసు సతీష్ దొడ్డిపట్ల సత్యలింగం పాల్గొన్నారు.
No comments:
Post a Comment