స్వయంభు సీతారాముల స్థలపురాణానికి విరుద్ధంగా భద్రాచలం రామాలయం క్రతువులు!
ఆదివారం, గొటుల్ - గోండ్వాన అధ్యయన కేంద్రం, భద్రాచలంలో ఆదిమ జాతుల సమన్వయ సమావేశం ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక, గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో దమ్మక్క సేవాయాత్రలో దమ్మక వారసులు ఆదివాసీలు కేవలం ఆటబొమ్మలు కావడం విడ్డూరమని, ఇది ఆదివాసీలతో గడపాలని స్వయంబు వెలసిన సీతారాముల కోరికకి విరుద్దమని, ఇది ఆ సీతారామచంద్రులను అవమానించడమేనని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రూ ఆక్షేపించారు.
భద్రాచలం చారిత్రక నేపథ్యనికి ఎటువంటి సంబంధం లేని కొందరి వలస వాదుల ఆధిపత్యంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దేవస్థానం బానిసయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడి కోరిక తీరకుండా ప్రాకారాలు కట్టిమరీ బందించారు. లాభాపేక్షతో క్రతువుల పేరిట వ్యాపారం చేస్తున్నారు. సీతారామచంద్రులను క్షోభకు గురించేస్తున్నారని,పాపం మూటకట్టుకుంటున్నారని. ఇప్పటికైనా కళ్లుతెరిచి ప్రభుతం తక్షణం స్వయంబు సీతారాముల కోరికకనుగుణంగా దమ్మక్క వారసులతో ఆదివాసీ సంప్రదాయ పద్దతులకనుగుణంగా నిత్య క్రతువులు సాగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా నాయకులు జగ్గా పుల్లయ్య, మహిళా నాయకులు జగ్గా కుమారి, ఆదివాసీ కొండరెడ్ల సంఘం జిల్లా నాయకులు ఉమ్మల దుర్గా రెడ్డి,గొటల్ అధ్యక్షులు వీసాల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment