VMRRNews// ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత




 ఖమ్మం : ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆనంద్ అనే యువకుడి మృతికి డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమనే అనుమానంతో కైకొండాయి గూడెం గ్రామస్తులు అతడిపై దాడికి యత్నించారు. గ్రామస్తులు కారును ధ్వంసం చేశారు. భయంతో రామ్మూర్తి నాయక్ ప్రభుత్వ పాఠశాలలో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తెచ్చే  ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఉద్రిక్తత ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


VMRNews// ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

 తెలంగాణ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తల్లాడ మండలం మెట్టుపల్లి గ్రామ సమీపంలో సత్తుపల్లి నుంచి సుమారు 30 మంది ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా బస్సు డ్రైవర్ క్యాబిన్‌ ఇరుక్కుపోయాడు. ప్రమాదం గమనించిన దగ్గరలోని గ్రామస్తులు అక్కడకు చేరుకొని డ్రైవర్‌ని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ పరిస్థిత కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం బ్రిడ్జిపై జరగటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.


VMRNews// తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

 

*తెలంగాణాలో కరోనా పంజా👊🏻.*
*గత 24 గంటల్లో 2,751 కొత్త కేసులు, 9 మరణాలు.*

*తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.*




కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతోంది.
నిత్యం మూడు వేలకు చేరువగా కరోనా కేసులు నమోదు అవుతున్నతీరు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది.
అధికారికంగా కంటే, అనధికారికంగా ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చాలామంది వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు ఒక లక్ష 20 వేలకు పైగానే ఉన్నాయి.

గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2751 కాగా కరోనాతో 9 మంది మృతి చెందారు.
దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 808 కి చేరింది.

ఇక తాజాగా 1675 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 89,350 మంది.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది.

యాక్టివ్ కేసుల సంఖ్య 30,008గా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది .
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనాకేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది.

జీహెచ్ఎంసీలో అత్యధికంగా 432 కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత రంగారెడ్డిలో 185, మేడ్చల్ జిల్లాలో 128 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేట్ చూస్తే 76.49 శాతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 74.3 శాతంగా ఉంది.
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ , రికవరీల రేటు కూడా బాగానే ఉండటంతో ప్రభుత్వాలు ఊపిరి తీసుకున్నాయి.

VMRNews// ఖమ్మం లో నీ 48వ డివిజన్ రాజు గృహకల్పనలో నీటి కొరత

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు గా.....





 ఖమ్మం పట్టణానికి కూతవేటు, దూరంలో మున్నేరు పక్కనే ఉన్నా " రాజీవ్ గృహకల్ప కల్ప కాలనీ లో" నీటి ఎద్దడి..
( సుమారుగా)మూడు,నాలుగు రోజుల నుండి నీటి సరఫరా లేదు.. వర్షాలు పడిన ప్రతిసారి కాలనీకి సంబంధించిన మోటర్లు నీటిలో కొట్టుకుపోవడం, తిరిగి 5, 6- రోజుల తర్వాత నీటిని పునరుద్ధరించడం పరిపాటిగా మారింది ..   ఈ నీటిని సప్లై చేయని టైం లో కాలనీలోని సుమారు 700 కుటుంబాల ప్రజలు నీటిని రెండంతస్తుల పైకి మోయడానికి అష్టకష్టాలు పడుతూ తమ దినచర్యను చేసుకుంటున్నారు... కాలనీలోని వృద్ధులు వికలాంగులకు నీటి సరఫరా జరగని రోజుల్లో నీళ్లు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. . ఈ విషయమై ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బుట్టదాఖలు అవుతుంది తప్ప ఎటువంటి శాశ్వత పరిష్కారం చూపించడం లేదు.... కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ నీటిసరఫరాను వెంటనే పునరుద్ధరణ చేయవలసిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు.... 

VMRNews// వాహనదారులకు మోదీ గుడ్ న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కలిగిన వారికి అదిరే శుభవార్త

 

 వాహనదారులకు మోదీ గుడ్ న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కలిగిన వారికి అదిరే శుభవార్త!



వాహనదారులకు మోదీ గుడ్ న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కలిగిన వారికి అదిరే శుభవార్త!

మీకు బైక్ ఉందా? లేదంటే స్కూటర్ కలిగి ఉన్నారా? ఇవి రెండూ కాదు ఏకంగా కారు ఉందా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

మోదీ సర్కార్ తాజాగా మోటార్ వెహికల్ డాక్యుమెంట్లు అయిన వెహకల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సహా ఇతర వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. 


కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో వాహనదారులకు చాలా ప్రయోజనం కలుగనుంది. తాజా నిర్ణయంతో ప్రజలకు డాక్యుమెంట్ల రెన్యూవల్‌కు ఎక్కువ గడువు అందుబాటులోకి వస్తుంది. 

సింపుల్‌గా చెప్పాలంటే వెహికల్ డాక్యుమెంట్లు ఏమైనా ఎక్స్‌పైరీ అయ్యి ఉంటే.. ఇప్పుడు ఇవి డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయి. అంటే ఈ ఏడాది లోపు ఎక్స్‌పైరీ అయిన డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకుంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్‌పైరీ అయ్యి ఉంటే దాన్ని కూడా డిసెంబర్ లోపు రెన్యూవల్ చేసుకోవచ్చు. 


VMRNews// హిందువులపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన VHP కార్యకర్తలు

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...