*తెలంగాణాలో కరోనా పంజా👊🏻.*
*గత 24 గంటల్లో 2,751 కొత్త కేసులు, 9 మరణాలు.*
*తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.*
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతోంది.
నిత్యం మూడు వేలకు చేరువగా కరోనా కేసులు నమోదు అవుతున్నతీరు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది.
అధికారికంగా కంటే, అనధికారికంగా ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చాలామంది వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు ఒక లక్ష 20 వేలకు పైగానే ఉన్నాయి.
గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2751 కాగా కరోనాతో 9 మంది మృతి చెందారు.
దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 808 కి చేరింది.
ఇక తాజాగా 1675 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 89,350 మంది.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది.
యాక్టివ్ కేసుల సంఖ్య 30,008గా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది .
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనాకేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది.
జీహెచ్ఎంసీలో అత్యధికంగా 432 కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత రంగారెడ్డిలో 185, మేడ్చల్ జిల్లాలో 128 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేట్ చూస్తే 76.49 శాతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 74.3 శాతంగా ఉంది.
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ , రికవరీల రేటు కూడా బాగానే ఉండటంతో ప్రభుత్వాలు ఊపిరి తీసుకున్నాయి.
No comments:
Post a Comment