అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు గా.....
ఖమ్మం పట్టణానికి కూతవేటు, దూరంలో మున్నేరు పక్కనే ఉన్నా " రాజీవ్ గృహకల్ప కల్ప కాలనీ లో" నీటి ఎద్దడి..
( సుమారుగా)మూడు,నాలుగు రోజుల నుండి నీటి సరఫరా లేదు.. వర్షాలు పడిన ప్రతిసారి కాలనీకి సంబంధించిన మోటర్లు నీటిలో కొట్టుకుపోవడం, తిరిగి 5, 6- రోజుల తర్వాత నీటిని పునరుద్ధరించడం పరిపాటిగా మారింది .. ఈ నీటిని సప్లై చేయని టైం లో కాలనీలోని సుమారు 700 కుటుంబాల ప్రజలు నీటిని రెండంతస్తుల పైకి మోయడానికి అష్టకష్టాలు పడుతూ తమ దినచర్యను చేసుకుంటున్నారు... కాలనీలోని వృద్ధులు వికలాంగులకు నీటి సరఫరా జరగని రోజుల్లో నీళ్లు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. . ఈ విషయమై ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బుట్టదాఖలు అవుతుంది తప్ప ఎటువంటి శాశ్వత పరిష్కారం చూపించడం లేదు.... కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ నీటిసరఫరాను వెంటనే పునరుద్ధరణ చేయవలసిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు....
No comments:
Post a Comment