అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత
ఖమ్మం రూరల్ మండలంలో పలు గ్రామాల్లోని ప్రజలకు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులయిన లబ్ధిదారులకు ఖమ్మం రురల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పిటిసి వరప్రసాద్, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి,సుడ డైరెక్టర్ సంజీవరెడ్డి, ఖమ్మం రూరల్ ప్రధాన కార్యదర్శిరెడ్యానాయక్, ఖమ్మం రూరల్ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు చేతుల మీదుగా అర్హులైన వారందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంపటి రవి, పసుపులేటి లక్ష్మయ్య, అక్కినపల్లి వెంకన్న, బాలు, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment