VMRNews// భద్రాచలం ముంపు గ్రామాలను పంటలను పరిశీలించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి

 కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు  కొండపల్లి శ్రీధర్రెడ్డి భద్రాచలం ముంపు గ్రామాలను పంటలను పరిశీలించడానికి వెళుతూ జూలూరుపాడు లో  ఆగినారు. వారిని జూలూరుపాడు లో బిజెపి నాయకులు  శాలువా కప్పి సన్మానం చేసినారు. అనంతరం కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ భీమా ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల  వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెందకుండా పోయినది.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఈ రోజు వరకు కూడా డబల్ బెడ్ రూమ్ పేరుతో ఏ ఒక్కరు కూడా గ్రామాల్లో   ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతులకు లక్ష రూపాలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంత వరకు లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు ఇవ్వలేదు, 57 సంవత్సరాల వృద్ధులకు నెలకు 2000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛను ఇవ్వలేదు, గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి చెందుతుంది, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కొరకు ఆయుష్మాన్ భవ పథకం ప్రవేశపెట్టారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం, మాకొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పినది ,దీనివల్ల పేద ప్రజలు వైద్యం చేయించుకోలేక అనారోగ్యంతో మృతి చెందుతున్నారు,  కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిలుకూరి రమేష్, మరియు బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్ , కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నున్న రమేష్, మండల ఉపాధ్యక్షుడు మాది నేని సతీష్, యువ మోర్చా మండల అధ్యక్షుడు భానోత్ సురేష్, ఉపేందర్ , సిరిపురపు పుల్లారావు, గోపాల్ రావు, వందనపు సుబ్బు ,కొండ సత్యనారాయణ, పాల్గొన్నారు.




No comments:

Post a Comment

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...