VMRNews// గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతిలేదు: పోలీస్ కమిషనర్

 గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతిలేదు: పోలీస్ కమిషనర్. (VMRNews)ఆగస్టు18: కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాల ఎర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వ తేదీన నిర్వహించుకోనే వినాయకచవితి పండుగ సందర్భంగా సామూహిక పూజలతో పాటు, బహిరంగ ప్రదేశాలలో గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు మండలపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేనందున ప్రజలందరు ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి వుంటుందని తెలిపారు. అదే విధంగా మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని, కోవిడ్ 19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరు తమ వంతు భాధ్యతగా పోలీసులకు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ తెలియజేశారు. 




No comments:

Post a Comment

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...