కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ఈరోజు PACS కల్లూరిగూడెం సొసైటీ ద్వారా సొసైటీ పరిధిలోని రైతులకు ఋణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ యొక్క ఉపయోగాలను ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పించడం ద్వారా PACS లు అభివృద్ధి చెందుతాయని, వీటి ద్వారా వచ్చే రుణాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు రైతులకు ఎన్నో ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని, వారు రైతులకు ఎంతో కృషి చేస్తున్నారని, ఈ పథకాల ద్వారా ప్రతి రైతు లబ్ధి పొందుతూ అభివృద్ధి చెందాలని అదేవిధంగా సొసైటీల మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ రైతులకు ఉపయోగకరమైన లోన్లు, రుణాలు, ఎరువులను రైతులకు అందిస్తూ, అదేవిధంగా పంటకోత తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం PACS ద్వారా కొనుగోలు చేస్తుంది, కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుంటూ, ప్రతి చిన్న, సన్నకారు రైతు ఎదిగేలా సొసైటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం , కూసుమంచి మండల ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఆత్మ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి , పిఎసిఎస్ కల్లూరుగూడెం చైర్మన్ వెంకటేశ్వర్లు, నేలకొండపల్లి AMC చైర్మన్ వడ్తియా సెట్రాం నాయక్, టిఆర్.యస్ కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు చాట్లా పరుశురాం, జూకురి గోపాల్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment