ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ గారు, మున్సిపల్ కమిషనర్ వింజం శ్రీనివాసరావు గారు.
పల్లిపాడు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో శివాలయం సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి సహకారంతో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను వైరా మున్సిపల్ చైర్మన్ సూతకని జైపాల్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ వింజం శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా 100 మట్టి విగ్రహాలు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు తాటిపల్లి సుధీర్ అధ్యక్షతన పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ సూతాకాని జైపాల్ గారు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అని అదేవిధంగా కరోనా కారణంగా భక్తులు అందరూ కూడా ఇళ్లలోనే గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి సూచించారు. కమిషనర్ వింజం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు చాలా స్ఫూర్తిని ఇస్తున్నాయని వారి ఆధ్యర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ ప్రశంసించ దగ్గ విషయం అని యూత్ అందరూ కూడా ఇలా ఉంటే దేశ్ అభివృద్ధి కచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు తాటిపల్లి సుధీర్ గారు ఫ్రెండ్స్ యూత్ జాయింట్ సెక్రెటరీ ఎల్. హిమానిష్ 16 వ వార్డ్ కౌన్సిలర్ చల్లాగొండ్ల నాగేశ్వరరావు గారు,17 వ వార్డ్ కౌన్సిలర్ తడికమల్ల నాగేశ్వరరావు గారు,కొణిజర్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోసూరి శ్రీను గారు, వైరా టౌన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దార్న రాజశేఖర్ గారు, వైస్ ప్రెసిడెంట్ మేడా వెంకటేష్ గారు, జనరల్ సెక్రెటరీ గుర్రం కృష్ణ గారు,యూత్ సభ్యులు కొండా ఉపేందర్,షేక్ రఫీ, హైమద్ పాషా, గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment