VMRNews// బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవి కుమార్ గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి

 బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవి కుమార్ గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని  బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కాలువ కట్ల వెంకటరత్నం ప్రధాన కార్యదర్శి ఆరికట్ల  వెంకటేశ్వర్లు కోరారు. కొనిజర్ల లో జరిగిన  సమావేశంలో వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో లింగాల రవి కుమార్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని పేద బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా కలెక్టర్ గారి కమిటీ లో అనేక సంవత్సరాలు పనిచేసి ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ చైతన్య యాత్రలు అంబేద్కర్ చైతన్య బాట దళిత చైతన్య సదస్సులు ప్రజా చైతన్య బేరి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ వారి సమస్యలను అధికారుయూటీడీకేజీర.ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారని తెలిపారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు చలివేంద్రాలు పేదలకు వస్త్రాలు పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రులలో  రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు లాక్ డౌన్ సమయంలో  పేదలకు నిత్యవసర వస్తువులు మాస్కులు శానిటైజర్ పంపిణీ చేశారని అన్నారు విద్యార్థులలో  దేశభక్తిని పెంపొందించేందుకు  అనేక వ్యాసరచన సెమినార్లు నిర్వహించి పేద విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు 20 ఏళ్లుగా తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసి ముందుకు సాగుతున్న లింగాల రవి కుమార్ గారికి . బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవి కుమార్ గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని. మీడియా ద్వారా విన్నవించుకున్నారు. కేటీఆర్ పువ్వాడ గార్లను లను   ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ప్రజాసేవలో ముందుకు కొనసాగేలా సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు ఈ సమావేశంలో గుడిమల్ల శాంతయ్య వై ప్రసాద్ ప్రకాశం తదితర నాయకులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...