మంత్రి పువ్వాడకు జ్ఞానోదయం కల్పించండి.. అంబేడ్కరా!
ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహంకు కేవీపీఎస్ విన్నపం...
ఖమ్మం, జూలై 23 :- దళిత మహిళా సర్పంచ్ ను అవమాన పర్చిన వారిపై SC/ST అట్రాసిటీ కేసును నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జెడ్.పి సెంటర్ లోని భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి దళితులకు, దళిత ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు జ్ఞానోదయాన్ని ప్రసాదించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానుద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ దళితులకు, దళిత ప్రజా ప్రతినిధులకు అండగా ఉండి రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉన్నటువంటి మంత్రి గారు, జిల్లా అధికారులు "కంచె చేను మేసిన చందంగా" దళిత మహిళా సర్పంచ్ ను వేదిక మీదకు పిలువకుండా అవమాన పర్చడం రాజ్యాంగ విరుద్ధమని వారు స్పష్టంచేశారు. రాజ్యాంగ ఉల్లంఘన కు పాల్పడిన అధికార యంత్రాంగం పైన చట్ట రీత్యా చర్యలు తక్షణమే తీసుకోవాలని, లేనిపక్షంలో జరిగే ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవల్సివస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు గంటా భీమయ్య, చాట్ల రాము, నకిరికంటి చిరంజీవి, నాదెండ్ల చిన్న పుల్లయ్య, కుక్కల సైదులు తదితరులు పాల్గొన్నారు....
-----///----///----------
దళిత సర్పంచ్ పైన జరిగిన అవమానాన్ని నిరసిస్తూ రేపు ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం ##
ఖమ్మం రూరల్ మద్దులపల్లి గ్రామ సర్పంచ్ పైన జరిగిన అవమాన ఘటనను నిరసిస్తూ కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఖమ్మంలో ఎన్.ఎస్.పి క్యాంపులోని మంచికంటి భవన్ లో "రాజ్యాంగ ఉల్లంఘన - దళిత చట్టాల అమలు" అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు హాజరు కానున్నారని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్, జిల్లా అధ్యక్షులు ఎం. ప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సమావేశంలో సామాజిక, కుల, ప్రజా సంఘాలు, మేధావులు, అభ్యుదయ, ప్రజాతంత్ర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు..
సామాజిక వందనములతో....
నందిపాటి మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి
KVPS - ఖమ్మం. 9959125536
Nice
ReplyDeleteNice
ReplyDelete