అరుదైన గౌరవం లభించినా రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు డా|| పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి శుభకాంక్షలు తెలిపిన BJYM నాయకులు .
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు ,మాజీ ఎమ్మెల్సీ డా"పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి అరుదైన గౌరవం లభించింది దశాబ్దాలుగా రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న సుధాకర్ రెడ్డి గారి సేవలను గుర్తించి ఢిల్లీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ విచార్ మంచ్ .ఆయన ను పండిట్ చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేసింది అలాగే ఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ శిక్ష ఇవాం తేల్ వికాస్ సంఘటన సంస్థ పండిట్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్మృతి పురస్కాారానికి కు ఎంపిక చేసింది .ఒకేసారి రెండు పురస్కారాలు అందుకోవడం విశేషం .ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సుధాకర్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు. కరోనా కారణంగా వెంటనే పురస్కారాలు అందుకోలేక పోతున్నామని త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందుకోనున్నట్లు డా"పొంగులేటి సుధాకర్ గారు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ అవార్డులకు ఎంపిక కావడం పట్ల BJYM రాష్ట ఉపాధ్యక్షులు గల్లా సత్యనారాయణ, BJP ఖమ్మం నగర అధ్యక్షులు రుద్ర ప్రదీప్, నగర ప్రధాన కార్యదర్శి వేల్పుల సుధాకర్, నగర కార్యదర్శి బోయినపల్లి చంద్రశేఖర్, శంకర్ గౌడ్,BJYM జిల్లా నాయకులు ఉపెందర్ గౌడ్ , వీరు గౌడ్ , ఈదుల భద్రం తదితరులు హృదయపూర్వక శుభకాంక్షల తెలిపి హర్షం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment