జస్టిస్ నాగార్జునరెడ్డి గారిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలనే కక్షతోనే దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ గారిపై దాడి. ఈ దాడిని ఖండిస్తూ, దాడిచేసిన, చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్:ఆంధ్ర బహుజన ప్రజావేదిక.
అనంతపురం జిల్లా, కదిరి పట్టణం నడిబొడ్డున ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి "ఆంధ్ర బహుజన ప్రజావేదిక"ఆధ్వర్యంలో పూల మాల సమర్పించి "దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ గారిపై దాడి చేసిన, చేయించిన వారిపై కఠిన చర్యలు - తీసుకోవాలి" అని "బహుజనుల ఐక్యత - వర్దిల్లాలి" అని "ఉయ్ వాంట్-జస్టిస్" అంటూ బిగ్గరగా నినాదాలు ఇచ్చి నిరసన వ్యక్త పరిచిన అనంతరం రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు గారు,మరియు,కెఅర్ హరిప్రసాద్ బహుజన్ గారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గం, బి. కొత్తకోట నివాసి మేజిస్ట్రేట్ రామకృష్ణ గారిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, MLA ద్వారకానాథ్ రెడ్డి గారి ప్రోద్బలంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, దాడిచేసిన, చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసువారిని డిమాండ్ చేస్తున్నాము.
ఎందుకంటే మేజిస్ట్రేట్ రామకృష్ణ గారికి, తన ఇంటి పక్కన ఉన్న రిటైర్డ్ వీఆర్వో వెంకటరెడ్డి గారికి మధ్య ఉన్న ఖాళీస్థల వివాదాన్ని బూచిగా చూపి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గారిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలనే కక్షతోనే దాడిచేయడం జరిగినది.2012లో కడపజిల్లా రాయచోటిలో మేజిస్ట్రేట్ గా రామకృష్ణ గారు పని చేస్తున్న సమయంలో జస్టిస్ నాగార్జునరెడ్డి గారితో వివాదం తలెత్తింది. దీనితో జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గారి అవినీతికి సంబంధించి హైకోర్టుకు మేజిస్ట్రేట్ రామకృష్ణ గారు ఫిర్యాదు చేయడం జరిగినది.2013లో జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గారు తన పలుకుబడిని ఉపయోగించి మేజిస్ట్రేట్ రామకృష్ణ గారిని సస్పెండ్ చేయించడం జరిగినది.
అప్పట్నుంచి జస్టిస్ నాగార్జునరెడ్డి గారి బంధువులైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, MLA ద్వారకానాథ్ రెడ్డి గారు, వైసీపీ వర్గీయులు మేజిస్ట్రేట్ రామకృష్ణ గార్ని అనేక విధాలుగా వేధిస్తూ భౌతికంగా అంతం చేసేందుకు రిటైర్డ్ వీఆర్వో వెంకటరెడ్డి గారితో తన ఇంటి వద్ద ఉన్న ఖాళీస్థలం వివాదాన్ని అడ్డుపెట్టుకుని గత సెప్టెంబర్ 9వ తేదీన మేజిస్ట్రేట్ రామకృష్ణ గార్ని ట్రాక్టర్ తో తొక్కించి చంపాలనే ప్రయత్నం చేశారు. దీనిమీద మేజిస్ట్రేట్ రామకృష్ణ గారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతనిపైనే పోలీసులు ఎదురు కేసు పెట్టారు. చివరికి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళితే ఈ మధ్యనే 15రోజుల కిందట తప్పుడు కేసుగా రుజువైందని మేజిస్ట్రేట్ రామకృష్ణ గారు వాపోవడం వారి వంతైంది.
ఈ నేపథ్యంలోనే రామకృష్ణ గార్ని మరోసారి కేసులో ఇరికించేందుకో,అంతం చేసేందుకో రెండు రోజులుగా రెక్కీ చేసి 14.7.2020 మంగళవారం తెల్లవారుజామున 5నుంచి6 గంటల మధ్యలో తన ఇంటి పక్కన శబ్దాలు రావడంతో రామకృష్ణ గారు బయటికి వచ్చి చూసే సమయంలో తన ఖాళీస్థలంలో ఉంచిన ఇటుకలను గుర్తు తెలియని వ్యక్తులు తరలించడం కనిపించింది. ఎవరు మీరు అని ప్రశ్నించి అడ్డుకున్న రామకృష్ణ గారిపై ఇటుకలతో దాడి చేయడం జరిగినది.కనుక దాడిచేసిన, చేయించిన మంత్రి, MLA గారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసువారిని డిమాండ్ చేస్తున్నాము.
ఇన్ని దారుణాలు జరగడానికి ప్రధాన కారణం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలే. ఎందుకంటే ఈ వర్గాలు తమ ఓట్లను ఈ రాష్ట్రంలో రెండు పార్టీల (TDP, YSRCP) పేరుతో పిలువబడుతున్న కమ్మ, రెడ్లు అనే కులాలకు వేయడం వలనే. కనుక ఇప్పటికైనా మహాత్మా పూలే,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల ఆశయం మేరకు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఏకమై రాజ్యాధికారం సాధించుకో కలిగినప్పుడు మాత్రమే అగ్రకుల ఆధిపత్యం నుండి తప్పుకో గలం. అందుకే నేను నా టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పుట్టపర్తి నుంచి 2019 ఎన్నికల్లో పోటీచేసినప్పుడు నా కరపత్రము నందు ఇప్పటివరకు TDP కి ఓట్లు వేసి పెనం మీద ఉన్నాము. ఈ ఎన్నికల్లో పొరపాటున YSRCP కి ఓట్లు వేస్తే పెనం మీద నుంచి నేరుగా పొయ్యిలో పడతామని చెప్పి రాసి ప్రతి ఓటరుకు ఇవ్వడం జరిగినది.మేము ఏదైతే చెప్పినామో అది ఇప్పుడు YSRCP చేసి చూపిస్తున్నది. కడపజిల్లా, రాయచోటి నియోజకవర్గం పరిధిలోని చిన్నమండెం మండలానికి చెందిన నక్కా ఆంజనేయులుకు కుడికాలు ఇరగగొట్టడం,డాక్టర్ సుధాకర్ గార్ని, డాక్టర్ అనితారాణి గార్ని పిచ్చివాళ్లను చేయడం,అనంతపురం జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని నల్లమాడ మండలం మీసాలవాండ్లపల్లిలో డేరంగుల శివయ్యపై దాడిచేయడం, ఇదే మండలంలో పెమనకుంట్లపల్లి తండా రవినాయిక్ పై దాడిచేయడం, కర్నూలు జిల్లా నంద్యాలలో బోయ కులానికి చెందిన న్యాయవాదిపై రెడ్డి న్యాయవాది దాడిచేయడం వంటివి అనేకం.అలాగే ఈ రోజు బహుజనులందరిపైనా రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులు,దాడులు, దౌర్జన్యాలు, అణచివేతలు, అవమానాలు, అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా గమనించగలరని మనవి చేస్తున్నాము.
రాష్ట్ర నాయకులు Y.ప్రసాద్,K.R.హరిప్రసాద్, కదిరి నియోజకవర్గం కన్వీనర్ S.ఇర్ఫాన్, కదిరి పట్టణం కో-కన్వీనర్ D.భాస్కర్, గౌరవాధ్యక్షులు BSNL S.లక్ష్మన్న, అంజి,శీనా,జయచంద్ర, ప్రసాద్,రమేష్,తొగట చంద్ర,రామకృష్ణ, నారాయణ, చలపతి,శ్రీరాములు ,వెంకటస్వామి తదితరులు.
కెఅర్ హరిప్రసాద్ బహుజన్
మంగలిమహసభ జాతీయసంఘం
బిసి మహజనసబితి ఎపి,టిఎస్
ఆంధ్ర బహుజన ప్రజావేదిక
Good post
ReplyDeleteNice
ReplyDelete