పాలేరు నియోజకవర్గం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎమ్మెల్యే వాహనం ఎమ్మెల్యే వాహనంలో వచ్చి ఎక్సైజ్ సిఐ జయశ్రీ హల్చల్ నా వాహనం చెడిపోవడంతోనే మా నాన్నగారి వాహనం వినియోగించాను..సీఐ జయశ్రీ
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు సమీపంలోని ఓ హోటల్ పై బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారంటూ రైడ్ చేసిన ఖమ్మం టౌన్ ఎక్సైజ్ సిఐ జయశ్రీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చి దాడి చేయటంతో ఖంగు తిన్న హోటల్ నిర్వాహకులు నిన్న సాయంత్రం ప్రారంభోత్సవం చేసిన హోటల్ పై అప్పుడే ఎలా ఫిర్యాదు అందిందని నిలదీసిన యజమాని ఎమ్మార్పీ కంటే 15 రూపాయలు అదనంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నా వైన్స్ షాపులని పట్టించుకోని అధికారులు నాపై ఎలా దాడులు చేస్తారంటూ పిండిప్రోలు లోని వైన్స్ షాపును మూసెయ్యాలని హోటల్ నిర్వాహకులు కొద్దిసేపు ఆందోళన చేశారు. సిఐ జయశ్రీ ని వివరణ కోరగా నేను పిండిప్రోలు గ్రామం లోని స్థానిక గంగా వైన్స్ షాప్ మరియు హోటల్ పైన రైడ్ చేసి కేసులు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.కరోన వైరస్ నేపథ్యంలో వైన్స్ షాపుల వారికి పర్మిట్ రూమ్ సౌకర్యాలు లేవని అలాంటిది మామూలు హోటల్ గా పెట్టుకొని అందులో బెల్ట్ షాప్ తో పాటు 10 మందితో కలిసి మద్యం సేవించడానికి సిట్టింగ్ ఎలా నిర్వహిస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు. అందుకని బెల్ట్ షాప్ రన్ చేస్తున్న హోటల్ యజమాని పైన మరియు వైన్స్ షాప్ మీద టైం వ్యాలీడ్ కేసులు నమోదు చేశామని సిఐ జయశ్రీ తెలిపారు. ఎమ్మెల్యే వాహనం మీరు వాడుకోవచ్చా అని విలేకరిగా ప్రశ్న వేయగా అందుకు సిఐ జయశ్రీ సమాధానమిస్తూ నేను మొదటగా నా వాహనంలో వచ్చానని ఏదులపురం గ్రామం వద్దకు రాగానే నా వాహనం చెడిపోవడంతో మావారికి ఫోన్ చేసి మానాన్న గారి బండి లో వెళ్లానని నేను ఒక్కదానిని వెళ్లలేదని నావెంట పోలీసు అధికారులు కూడా వచ్చారని ప్రభుత్వ పనిమీదనే మా నాన్నగారి వాహనం వినియోగించనని అలా వినియోగినించకూడది తెలుసు తప్పని పరిస్థితుల్లో వినియోగించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
No comments:
Post a Comment