మురికి కాలువల పక్కన నివసించే ప్రజలను అకస్మాత్తుగా ఖాళీ చేయాలంటే ఎటు వెళ్లాలో తోచని పరిస్థితుల్లో వారికి మద్దతు పలికిన బిజెపి నాయకులు .
ఖమ్మం నగరం లో 41,42,43,44 డివిజన్ లో మురికి కాల్వల పక్కన నివసించే ప్రజలను అకస్మాత్తుగా ఖాళీ చేయాలని డివిజన్ కార్పోరేటర్లు ఆ దేశాలు ఇస్తే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి లో వారు భారతీయ జనతా పార్టీని ఆశ్రఇంచారు,ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న భారతీయ జనతా యువ మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఆ డివిజన్ ప్రజల తో మాట్లాడితే....వారు ఈ డివిజన్‌వలో గత 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నట్టు,వారి పేరు మీద కరెంటు బిల్లు, పంపు బిల్లు,ఇంటి పన్ను వస్తుందని,ఖమ్మం నగరం లో పంపింగ్ రోడ్డు , ప్రకాశ్ నగర్ , శ్రీనివాస నగర్,మురికి కాల్వల పక్కన నివసించే కుటుంబాలను కాలువల అభివృద్ధి పేరు తో కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో మరియు లాక్ డౌన్ సమయం లో ఉన్నఫలంగా అక్కడ ఉన్న ఇళ్లను కూల్చాలని కోవడం దారుణమని ,మరి ఇలాంటి సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదని వారికి ఏదో రకంగా ప్రత్యామ్నాయం చూపించలాని,మున్సిపాలిటీ అధికారులు గానీ కార్పొరేటర్లు గానీ వారికి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా వారి ఇళ్లను కూల్చి రోడ్డుపై పడేస్తే సహించమని వారికి బిజెపి ప్రభుత్వం అండగా ఉంటుందని,ఈ విషయం లో మన మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు జోక్యం చేసుకుని కనీసం వాళ్ల కి డబుల్ బెడ్రూము ఇల్లు ఏర్పాటుచేసి వారిని అందులోకి పంపిన తర్వాతే కూల్చాలని, .వారికి ఏ ఆధారం చూపించకుండా ఇళ్లను కూలగొట్టి రోడ్డుపై పడేస్తే పేద ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని మరియు వారికి అండగా ఉంటుందన్నారు . ఈ కార్యక్రమం లో ఖమ్మం నగర బిజెపి ప్రధాన కార్యదర్శి వేల్పుల సుధాకర్ ,బిజెపి నగర కార్యదర్శి బోయిన పల్లి చంద్రశేఖర్ , బీజేవైఎం జిల్లా నాయకులు అనంతు ఉపేంద్ర గౌడ్ , టేకుమట్ల వీరు గౌడ్ , ఈదుల వీరభద్రం , బిజెపి నాయకులు మరియు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment