భారతీయ జనతాపార్టీ ఆధర్యం లో స్థానిక 47 డివిజన్ లో వీధి వ్యాపారుల కు మాస్కులు , శానిటైజర్లు పంపిణీ .
ఖమ్మం నగరంలోని 47 డివిజన్ లో గల కాల్ ఓడ్డు ప్రాంతం లో ఈ రోజు రేపాకుల సైదులు ఆధ్వర్యం లో ముఖ్యఅతిథి గా జిల్లా అధ్యక్షుడు ఉదయ ప్రతాప్ గారు పాల్గొన్నారు . వారి చేతుల మీదుగా వంద మంది తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే కూరగాయలు , అరటి పండ్లు , పూలు మరియు బోండాలు అమ్మే వాళ్లకి సుమారుగా (100) మంది మాస్కులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో శానిటైజర్ ఫేస్ స్టిల్స్ మరియు మాస్కులు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఉదయ ప్రతాప్ గారు మాట్లాడుతూ.... కాలువ ఒడ్డున వ్యాపారం చేసుకునే తోపుడుబండ్ల వారు ఈ కరోనా నేపథ్యంలో సురక్షితంగా ఉండాలని చాలా జాగ్రత్తగా ఉంటూ... మీ వ్యాపారాన్ని కొనసాగించు కోవాలని అన్నారు , ఈ corona మహామారి కనపడని అంటురోగము అని మనము చాలా జాగ్రత్తగా ఉండాలని కనుక మాస్కులు శానిటైజర్ ఉపయోగించుకుంటూ.. వ్యాపారం తగు జాగ్రత్తగా చేసుకోవాలని , మోడీ గారి పాలన లో అందరూ సురక్షితంగా ఉండాలని మాస్కులు ,శానిటైజర్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. వీధి వ్యాపారుల అందరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది వేల రూపాయల రుణాన్ని కి అందరూ దరఖాస్తు చేసుకొని, లబ్ధి పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మేకల నాగేందర్ , జ్వాలా నరసింహారావు , ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల వెంకట నరసయ్య , బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి వీరభద్రం, జిల్లా నాయకులు రేఖ సత్యనారాయణ ,దార్ల శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు .
Nice
ReplyDelete