భారతీయ జనతాపార్టీ విజయోత్సవాలు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఉత్తర ప్రదేశ్ ,ఉత్తరఖాన్డ్ మణిపూర్ ,గోవా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు యోగి ఆదిత్య నంద కి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైరా నియోజకవర్గ కన్వీనర్ బండారు నరేష్. వైరా మరియు కొణిజర్ల సెంటర్ నందు విజయోత్సవ ర్యాలీ చేసి బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ కొణిజర్ల మండలం అధ్యక్షుడు తుప్పతి మల్లికార్జున్ పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ మాట్లాడుతూ అవినీతి రహిత పాలనను అందిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో యోగి ఆదిత్యనాథ్ మరోసారి పట్టం కట్టారని. ఇది పాలనకు ప్రతికనీ అభివృద్ధి , అవినీతిరహిత పాలనకు ప్రజలు అండగా నిలిచారని . రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యకులు బండి సంజయ్ నాయకత్వం కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని. ఈ నియంతృత్వ కెసిఆర్ అబద్ధపు, మోసపూరిత వాగ్దానాల,గడిల పాలనకు రోజులు దగ్గర పడ్డాయని .భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోటేశ్వరరావు, బాధ్రయా, తుప్పతి మల్లికార్జున్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment