197 మంది జర్నలిస్ట్ లకు ఆర్థిక సహయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన 197 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వీరిలో పాజిటీవ్ లు వచ్చిన 128 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున 25 లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం, అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న 69 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున 6 లక్షల 90 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. మొత్తంగా 32 లక్షల 50 వేల రూపాయలను మీడియా అకాడమి నిధుల నుండి ఈ సహాయం అందించామని తెలిపారు.
కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. సోమవారంనాటికి వివిధ జిల్లాల నుండి కొత్తగా మరో 29 మంది జర్నలిస్టులకు పాజిటివ్ వచ్చిందని, వీరితోపాటు మరో 17 మంది జర్నలిస్టులను హోంక్వారంటైన్ లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారని ఆయన తెలిపారు. ఆ 29 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున 5 లక్షల 80 వేలు, హోంక్వారైంటైన్ లో ఉన్న17 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున ఒక లక్షా 70 వేలు, మొత్తం 7 లక్షల 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.
జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు దృవికరించిన మెడికల్ రిపోర్టు లు అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.
No comments:
Post a Comment